నోట్ల రద్దు తర్వాత మోడీ హవా: ఎన్నికలొస్తే 360 సీట్లు
నోట్ల రద్దు ప్రధాని నరేంద్ర మోడీకి, బీజేపీకి మంచి మైలేజీ తీసుకు వచ్చిందా? అంటే తాజా సర్వే అవుననే చెబుతోంది.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు ప్రధాని నరేంద్ర మోడీకి, బీజేపీకి మంచి మైలేజీ తీసుకు వచ్చిందా? అంటే తాజా సర్వే అవుననే చెబుతోంది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎన్డీయేకు 360 సీట్లు వస్తాయని తాజాగా ఇండియా టుడే - కార్వీ చేసిన సర్వేలో తేలింది.
అదే సమయంలో యూపీఏ మిత్రపక్షాలకు కేవలం 60 మాత్రమే వస్తాయని సర్వేలో తేలింది. నోట్ల రద్దు అనంతరం పాత నోట్ల మార్పిడికి గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన చివరి అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో 19 రాష్ట్రాలలో ఈ సర్వే చేశారు.

బీజేపీకి 42 శాతం ఓట్లు
డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు సర్వే నిర్వహించారు. ఎన్డీయే 42 శాతం ఓట్లతో 360 లోకసభ స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేవలం 25 శాతం ఓట్లతో 60 సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. ఇతరులకు 33 శాతం ఓట్లు వస్తాయని తేలింది.

ప్రధానిగా మోడీ ముందంజ
ప్రధానమంత్రి పదవికి ఉత్తమ అభ్యర్థిగా మోడీ అందరికన్నా ముందంజలో ఉన్నారు. ఈ సర్వేలో ఆయనకు 65 శాతం ఓట్లు లభించాయి. నోట్ల రద్దుకు ముందు ఆగస్టులో నిర్వహించిన ఇలాంటి సర్వేలో ఎన్డీయేకు వచ్చే ఓట్లు 40 శాతం అని తేలింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎన్‌డీఏకు వచ్చే ఓట్లు మరో రెండు శాతం పెరిగాయి.

పెద్ద నోట్ల ప్రభావం..
పెద్ద నోట్ల రద్దు తర్వాత మోడీపై విపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినా ఆయనకున్న ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, గోవాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడేందుకే ఎక్కువ అవకాశాలున్నాయని ది వీక్-హంస నిర్వహించిన సర్వేలో తెలిపింది.

బీజేపీ హవా
ఉత్తర్‌ప్రదేశ్, గోవాలో బీజేపీ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని తేలింది. పంజాబ్‌లో ఏకైక అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించనుంది. ఉత్తరాఖండ్‌లో మాత్రం బీజేపీనే స్పష్టమైన విజయం వరిస్తుందని తేలింది.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications