బోనస్, లీవ్ ఇవ్వలేదని బాస్ భార్యను చంపేశాడు
చెన్నై: తన బాస్ తనకు పొంగల్ పర్వదినం సందర్భంగా బోనస్, సెలవు ఇవ్వలేదని ఆగ్రహించిన ఓ వర్కర్ అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. అంబత్తూరులోని ఈటరీలో పనిచేసే వర్కర్ దారుణానికి ఒడిగట్టాడు. బాస్ ఇంటికి వెళ్లిపోయి, సోమవారం రాత్రి బాస్ భార్యను, ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచాడు. యజమాని భార్య మాత్రం మరణించింది.
వారిని పొడిచిన తర్వాత తాపీగా అతను పనికి వచ్చాడు. సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ సాయంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతన్ని రామనాథపురానికి చెందిన పాతికేళ్ల విక్కీ అలియాస్ విఘ్నేశ్వరన్‌గా గుర్తించారు. నిజానికి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు సంఘటన జరిగింది. అయితే, యజమాని మైకెల్ రాజ్ రాత్రి పదకొండున్నర గంటలకు గానీ తన భార్య అరోకియా వనిత, పిల్లు ఎం డానిష్ (5), ప్రిన్సిక (2) దాడి జరిగిన విషయాన్ని తెలుసుకోలేకపోయాడు.

ఇంటికి వెళ్లిన తర్వాత అతనికి ఆ విషయం తెలిసింది. డానిష్ కత్తిగాట్లకు ఎగ్మోర్‌లోని శిశు ఆరోగ్య, శిశు ఆస్పత్రి సంస్థ వైద్యులు చికిత్స చేస్తున్నారు. ప్రిన్సిక గొంతుపై 11 కత్తి గాట్లు పడ్డాయి. నుంగమ్‌బాకంలోని కంచి కామకోటి శిశు ట్రస్టు ఆస్పత్రిలో చికిత్స ఆమెకు చికిత్స జరుగుతోంది.
నిందితుడు కప్ బోర్డు నుంచి 40 వేల రూపాయలు, వనిత బంగారం గొలుసు ఎత్తుకుపోయాడు. అంబత్తూరులోని తులసి స్ట్రీట్‌లోని భవనం తొలి అంతస్తులో రాజ్ కుటుంబం ఉంటోంది. ఇంటి యజమానికి సుబ్రహ్మణ్యం తాను ఉండే రెండో అంతస్థులో సిసిటివి కెమెరాలు పెట్టుకున్నాడు. వాటి ఆధారంగా విక్కీని పోలీసులు పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications