డిప్యూటీ సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
దేశంలో గగనతల ప్రమాదాలు భారీగా పెరిగిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ దఫా ఈ ప్రమాదాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతూ వస్తోంది. ఈ విమాన ప్రమాదం వల్లే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్.. ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఆయన ప్రయాణిస్తోన్న విమానం బారామతి ఎయిర్ పోర్ట్ సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో అజిత్ పవార్ తో పాటు ఇతర సిబ్బంది కన్నుమూశారు.
ఇప్పుడు తాజాగా అలాంటి ప్రమాదమే సంభవించింది గానీ.. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో కొద్దిసేపటి కిందటే ఈ ఘటన సంభవించింది. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. లక్నో నుంచి కౌశాంబికి వెళ్తున్న ఆయన హెలికాప్టర్‌లో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తంది. దీంతో లక్నోలోని అమాసి విమానాశ్రయంలో ఈ హెలికాప్టర్ ను అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం- కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రత్యేక హెలికాప్టర్ లో కౌశంబీకి బయలుదేరారు. ఆయన ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ లక్నోలోని లా మార్ట్స్ గ్రౌండ్స్ నుండి కౌశాంబికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల తర్వాత హెలికాప్టర్ క్యాబిన్‌లో పొగ కమ్ముకుంది. డిస్‌ప్లే కూడా స్తంభించిపోయింది. ఆ సమయంలో కేశవ్ ప్రసాద్ మౌర్య హెలికాప్టర్ లోనే ఉన్నారు. హెలికాప్టర్ లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
పరిస్థితిని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తం అయ్యారు. లక్నో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంప్రదించారు. హెలికాప్టర్ కు అత్యంత సమీపంలో ఉన్న అమాసి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ఏటీసీ నుండి తక్షణమే ఆమోదం లభించింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్ ను సురక్షితంగా నేలకు దించారు. భద్రతా సిబ్బంది ఆయనను క్షేమంగా బయటికి తీసుకొచ్చారు.
డిప్యూటీ సీఎం క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆయనతో పాటు సిబ్బందికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. సాంకేతిక లోపమే ప్రధాన కారణమని తేలింది. దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతామని అధికారులు వెల్లడించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications