డిప్యూటీ ఎస్పీ ఆత్మహత్య: మంత్రిపై కేసు నమోదు చేయమన్న హైకోర్టు

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: డిప్యూటీ ఎస్పీ ఎంకే గణపతి ఆత్మహత్య పైన కర్నాటక హైకోర్టు సోమవారం నాడు స్పందించింది. ఈ ఆత్మహత్యకు సంబంధించి మంత్రి కేజే జార్జ్, ఇతర ఇద్దరు పోలీసులు అధికారుల పైన కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు తీర్పు పైన మంత్రి కేజే జార్జ్ స్పందించారు. కోర్టు ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటామని, కోర్టు కేసు నమోదు చేయమని చెబితే చేయాల్సిందేనని, కానీ విచారణలో తాను నిర్దోషిగా బయటపడతానని ఆయన చెప్పారు.

 KJ George

51 ఏళ్ల వయస్సున్న గణపతి తన జూలై 7వ తేదీన మడికేరిలోని లాడ్జిలో గల తన గదిలో సీలింగ్ ఫ్యానుకు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు, ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

అతను మంత్రి జార్జ్, ఇద్దరు అధికారులు ప్రసాద్ ప్రణబ్ మొహంతీల పైన ఆరోపణలు చేశారు. తన ఆత్మహత్యకు వారే కారణమని చెప్పారు. నాకు ఏం జరిగినా వారిదే బాధ్యత అన్నారు.

ఆయన ఆత్మహత్య అనంతరం సిద్ధరామయ్య ప్రభుత్వం దీని పైన జ్యూడిషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జ్యూడిషియల్ కమిషన్ వేశామని, ఆరు నెలలో నివేదిక వస్తుందని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A local court here on Monday ordered charges to be filed against Minister for Bengaluru Development, K J George, and two other policemen for abetting the suicide of Deputy Superintendent of Police MK Ganapati.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి