డేరా బాబాకు వ్యతిరేకంగా మాట్లాడిన అందర్నీ ఖతం చేస్తాం: ‘ఖుర్బానీ లీగ్’ హెచ్చరిక లేఖ
డేరాబాబా గుర్మీత్ సింగ్ వ్యవహారంలో హర్యానా పోలీసులకు మరో కొత్త సవాల్ ఎదురువుతోంది. గుర్మీత్ సింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన అందర్నీ చంపేస్తామంటూ డేరా సచ్చా సౌధా అనుబంధ సంస్థ ‘ఖుర్బానీ లీగ్’ ప్రకటించడం
న్యూఢిల్లీ: డేరాబాబా గుర్మీత్ సింగ్ వ్యవహారంలో హర్యానా పోలీసులకు మరో కొత్త సవాల్ ఎదురువుతోంది. గుర్మీత్ సింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన అందర్నీ చంపేస్తామంటూ డేరా సచ్చా సౌధా అనుబంధ సంస్థ 'ఖుర్బానీ లీగ్' ప్రకటించడం కలకలం సృష్టిస్తోంది.
ఇంతకు ముందు కూడా గుర్మీత్ అనుచరులు డేరా సచ్చా సౌధాకి చెందిన ఓ వార్తాపత్రిక ద్వారా ఇదే తరహాలో ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు.

ఇప్పటికే మీడియాకు ఎక్కిన డేరాబాబా మాజీ అనుచరులు, పోలీసులు, జర్నలిస్టులను హెచ్చరిస్తూ ఈ మేరకు బెదిరింపు లేఖలు అందినట్టు చెబుతున్నారు. తాజాగా జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఖుర్బానీ లీగే లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి.
జైలు శిక్ష అనుభవిస్తున్న డేరాబాబాను సమర్థిస్తున్న ఆయన అనుచరులు ఆయనపై వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తున్న కొన్ని మీడియా చానెళ్ల పేర్లను కూడా నేరుగా ప్రస్తావించారు. అధికార బీజేపీ ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వం డేరాబాబాను మోసం చేశాయంటూ ఆరోపించారు.
అంతేకాదు... ''గుర్మీత్ సింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ప్రతీకారం తీర్చుకుని ఆత్మాహుతి చేసుకునేందుకు డేరాకి చెందిన 200 మంది పిల్లలు సిద్ధంగా ఉన్నారు...'' అని ఆ హెచ్చరిక లేఖలో పేర్కొన్నారు.
రిజిస్టర్డ్ పోస్టు ద్వారా చండీఘడ్‌లోని పలు మీడియా కార్యాలయాలకు ఈ బెదిరింపు లేఖలు పంపినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. డేరా అనుబంధ సంస్థ రాసిన బెదిరింపు లేఖలపై ఇప్పటికే విచారణ ప్రారంభించామని హర్యానా పోలీసులు వెల్లడించారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications