తెలంగాణకు వ్యతిరేకంగా ఓటు, సమైక్యానికే: దేవెగౌడ
బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌ను విభజించేలా పార్లమెంటులో బిల్లు వస్తే సమైక్యాంధ్రకే మద్దతు ఇస్తానని మాజీ ప్రధాని, జెడిఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచేందుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని దేవెగౌడను కోరుతూ చిత్తూరు జిల్లా కుప్పం సమైక్యాంధ్ర జెఎసి నాయకులు కలిశారు. కుప్పం నుంచి సుమారు 30 మంది వివిధ శాఖల ఉద్యోగులు, పలు సంఘాల ప్రతినిధులు శుక్రవారం బెంగళూరుకు వచ్చారు.
జేడీఎస్ జాతీయ స్థాయి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న దేవెగౌడను వారు ప్రత్యేకంగా కలిశారు. రాష్ట్రం విడిపోతే వెనుకబడిన రాయలసీమ ప్రాంతం మరింత అధ్వానంగా మారుతుందని, జల వనరులకు సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయని జేఏసీ నాయకులు దేవెగౌడకు వివరించారు.

70 రోజులుగా సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నా కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని వారు వివరించారు. ఇందుకు స్పందించిన దేవెగౌడ కాంగ్రెస్ అధిష్ఠానం తీరు సరిగా లేదని, నాటకాలు ఆడేలా వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
సమైక్యానికి మద్దతుగా పార్లమెంటులో ప్రస్తావిస్తానని వారికి హామీ ఇచ్చారు. జేఏసీ నాయకులు జగదీశ్ బాబుతో సహా పలువురు పాల్గొన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications