వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్దతివ్వం, కేసుపై మాట్లాడం: పన్నీరుకు స్టాలిన్ షాక్, యూ టర్న్

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పైన డీఎంకే అధినేత, ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ సోమవారం నాడు మండిపడ్డారు. పన్నీరు సెల్వం కుర్చీని కాపాడుకునేందుకే ప్రయత్నాలు చేస్తున్నారని, సమస్యల పరిష్కారంపై దృష్టి

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పైన డీఎంకే అధినేత, ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ సోమవారం నాడు మండిపడ్డారు. పన్నీరు సెల్వం కుర్చీని కాపాడుకునేందుకే ప్రయత్నాలు చేస్తున్నారని, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదన్నారు.

సీన్ రివర్స్: ఆత్మరక్షణలో పన్నీరు, మోడీకి శశికళ షాక్!సీన్ రివర్స్: ఆత్మరక్షణలో పన్నీరు, మోడీకి శశికళ షాక్!

ఈ రోజు మధ్యాహ్నం పన్నీరుతో భేటీ కోసం స్టాలిన్ వచ్చారు. పదిహేను నిమిషాలు వేచి చూసి వెళ్లిపోయారు. వారి మధ్య భేటీ జరుగుతుందని అందరూ భావించారు. కానీ పన్నీరు ఆలస్యంగా వచ్చారు. దీంతో భేటీ జరగలేదు. ఈ కారణంగా స్టాలిన్ యూ టర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

ఈ రోజు డీఎంకే సమావేశమయింది. ఈ సమావేశంలో 11 తీర్మానాలు చేశారు. భేటీ అనంతరం స్టాలిన్ మాట్లాడారు. పన్నీరు కుర్చీ కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని చెప్పారు.

Development work on hold, Governor must take immediate step: MK Stalin on AIADMK crisis

జయలలిత అక్రమాస్తుల కేసు విషయమై తాము అప్పుడే మాట్లాడమన్నారు. కోర్టు తీర్పు రావాల్సి ఉందన్నారు. మెజారిటీ ఎవరికి ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయాన్నే తాము గవర్నర్ వద్ద ప్రస్తావించామని చెప్పారు.

పన్నీరుకు దెబ్బ: శశికళ బంధించలేదని చెప్పిన ఎమ్మెల్యేలుపన్నీరుకు దెబ్బ: శశికళ బంధించలేదని చెప్పిన ఎమ్మెల్యేలు

ప్రభుత్వం ఏర్పాటు విషయమై గవర్నర్ తక్షణమే నిర్ణయం తీసుకోవాలన్నారు. లేదంటే రాష్ట్రం నష్టపోతుందని చెప్పారు. స్థిర ప్రభుత్వం పైన గవర్నర్ నిర్ణయం తీసుకోవాలన్నారు. గవర్నర్ వెనుక బీజేపీ ఉందని తమిళ ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.

అనిశ్చితికి వెంటనే తెరదించాలన్నారు. అన్నాడీఎంకే తమ ప్రత్యర్థి పార్టీ అని చెప్పారు. ఆ పార్టీకి తాము మద్దతిచ్చే ప్రసక్తి లేదని చెప్పారు. తమిళనాడులో స్థిర ప్రభుత్వం కావాలని స్టాలిన్ అన్నారు.

English summary
MK Stalin refused to comment on the disproportionate asset case in which Supreme Court's verdict is pending but said he is not favoring any faction in the AIADMK.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X