కొత్తదేం కాదు! మహాభారతం నుంచే ఇంటర్నెట్: సీఎం బిప్లబ్ ఆసక్తికర వ్యాఖ్యలు
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇంటర్నెట్ అనేది కొత్తగా సృష్టించిన టెక్నాలజీ కాదని మహాభారతం సమయం నుంచే ఇంటర్నెట్ ఉందని వ్యాఖ్యానించారు ఆయన వ్యాఖ్యానించారు.
త్రిపుర రాజధాని అగర్తలాలోని ప్రజ్ఞా భవన్‌లో మంగళవారం నిర్వహించిన కంప్యూటరైజేషన్‌పై వర్క్‌షాప్ కార్యక్రమానికి సీఎం బిప్లబ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కురుక్షేత్రంలో జరిగిన 18 రోజుల యుద్ధం గురించి సంజయ్ అనే వ్యక్తి ధృతరాష్ట్రుడికి ఇంటర్నెట్ ద్వారానే సమాచారం అందించారని అన్నారు. దీనిని బట్టి చూస్తే మహాభారతం సమయం నుంచే దేశంలో ఇంటర్నెట్ సేవలు, శాటిలైట్లు అందుబాటులో ఉండేవని తెలిపారు.

అలా వేలాది సంవత్సరాల క్రితం అందుబాటులో ఉన్న ఇంటర్నెట్‌ను ఎన్‌ఐసీ(జాతీయ సమాచారం కేంద్రం) వినియోగించుకుంటోందని పేర్కొన్నారు.
'జాతీయ సమాచార కేంద్రం నిర్వాహకుల పనితనాన్ని అభినందిస్తున్నాను. కానీ టెక్నాలజీని మీరు కనిపెట్టలేదు. వేలాది ఏళ్ల క్రితమే కనిపెట్టారు. టెక్నాలజీని తామే కనిపెట్టామని యూరోపా దేశాలు చెప్పుకుంటాయి. కానీ నిజానికి ఆ టెక్నాలజీ మనది' అని బిప్లమ్ అన్నారు.
'మన మైక్రోసాఫ్ట్ ఇంజినీర్లు అమెరికాతో పాటు ఇతర విదేశాల్లోనూ పనిచేస్తున్నారు.
సంస్కృతికి మన దేశం పెట్టింది పేరు. అంతేకాదు నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాకే యావత్ భారతదేశం టెక్నాలజీకి మరింత దగ్గరైంది. మన ప్రధాని సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉంటారు. అలాంటి ప్రధాని మనకు దొరకడం మన అదృష్టం. టెక్నాలజీ కేవలం ధనికులకు మాత్రమే కాదు. పేదలు కూడా వినియోగించుకోవాలి' బిప్లమ్ కుమార్ దేబ్ పిలుపునిచ్చారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications