బీజేపీకి 122 సీట్లు: ఐదు దశల ట్రెండ్ ఇదేన్న అమిత్ షా -నందిగ్రామ్‌లో మమత ఓటమి తథ్యం
కరోనా ఉధృతి నేపథ్యంలో భారీ సభలు వద్దని సూచనలు వస్తున్నా, రాహుల్ గాంధీ లాంటి నేతలు తమ పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నా, బీజేపీ ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలదళం ఆదివారం కూడా భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించింది. పూర్బ బర్దమాన్ ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతున్నదని, ఇప్పటి వరకు పూర్తయిన ఐదు దశల ఎన్నికల్లో మొత్తం 185 సీట్లకుగానూ 122 సీట్లలో టీఎంసీ కంటే బీజేపీ ముందంజలో ఉందని అమిత్ షా చెప్పారు. బెంగాల్‌ను విశ్వాస్, వికాస్, వ్యాపార్ దిశగా అభివృద్ధి పథంలో నడిపించేది బీజేపీ మాత్రమేనని ప్రజలు నమ్మబట్టే ఫలితాలు అనుకూలంగా వస్తాయన్నారు.
టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవలం ప్రధాని మోదీని ఆడిపోసుకోవడం, భద్రతా బలగాలకు శాపనార్దాలు పెట్టడానికి తన సమయం కేటాయిస్తున్నారని, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ఎలాంటి ఎజెండా ఆమె వద్ద లేదని అమిత్ షా మండిపడ్డారు. దీదీ 12 నిమిషాలు మాట్లాడితే, అందులో పది నిమిషాలు మోదీని, తనను విమర్శించడానికి, మరో 2 నిమిషాలు బలగాలను ఆడిపోసుకోవడానికి కేటాయిస్తున్నారని విమర్శించారు.

నాలుగో దశ పోలింగ్ సందర్భంలో కూచ్ బెహార్ హింస పేట్రేగడం, కేంద్ర బలగాల కాల్పుల్లో నలుగురు పౌరులు చనిపోవడాన్ని, మృతదేహాలతో నిరసనలు చేయాలని సీతల్‌కుచి నియోజకవర్గం అభ్యర్థికి మమతా బెనర్జీ చెబుతున్నట్టు వెలుగుచూసిన ఆడియోలను ప్రస్తావిస్తూ, శవాలతో మమత రాజకీయాలు చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు షా.
పశ్చిమబెంగాల్‌లో ఉంటున్న చొరబాటుదారులు అసలైన బెంగాల్ ప్రజల హక్కులను, ఉద్యోగాలను దోచుకుంటున్నారని, చొరబాటుదారులను రాష్ట్రంలోకి రాకుండా నిరోధించగలిగే సత్తా ఒక్క బీజేపీకే ఉందని అమిత్ షా అన్నారు. బెంగాల్ లో 6వ విడత పోలింగ్ ఈనెల 22న, 7వ విడత 26న, 8వ విడత 29న జరుగనుంది. దీంతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మే 2న ఫలితాలు వెలువడతాయి.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications