నాలుగేళ్ల బాలికపై "డిజిటల్ రేప్".. అంటే ఏంటి ? ఎక్కడ జరిగిందంటే ?
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన అత్యంత హేయమైన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు జరిగిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఈ దారుణాన్ని 'డిజిటల్ అత్యాచారం'గా పోలీసులు పరిగణించారు. ఈ తరహా ఘటన వారి కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా సభ్యసమాజన్ని సైతం షాక్ కి గురిచేస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జూలై 14, 2025న బాలిక మర్మాంగాల వద్ద నొప్పితో బాధపడుతుండటంతో పరీక్షించగా గాయాలు కనిపించాయి. చిన్నారి నొప్పికి కారణం తెలుసుకుని ఆమె తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ఆమె మర్మావయవాల వద్ద గాయాలు ఉన్నట్టు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

కారణం ఎవరంటే..
జరిగిన ఈ ఘటనలో స్కూల్ వ్యాన్ డ్రైవర్ మొహమ్మద్ ఆరిఫ్ ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై పోక్సో చట్టం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పలు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. అలానే స్కూల్ మేనేజర్ సందీప్ కుమార్ పై కూడా సహ నిందితుడిగా కేసు నమోదు చేశారు. బాలికపై డిజిటల్ అత్యాచారం జరిగినట్టు నిర్ధారించారు.
'డిజిటల్ అత్యాచారం' అంటే..?
'డిజిటల్ అత్యాచారం' అంటే.. చేతి లేదా కాలి వేళ్లను సమ్మతి లేకుండా బాధితురాలి ? బాధితుడి మర్మావయవాల్లో చొప్పించడం అని అర్ధం. ఇక్కడ 'డిజిటల్' అంటే నంబర్లు కాదని.. డిజిట్స్ (వేళ్లు) అని అర్థం అని స్పష్టం చేశారు. ఈ చర్య కూడా అత్యాచారం మాదిరిగానే తీవ్రమైన లైంగిక నేరంగా పరిగణలోకి వస్తుందని తెలుస్తోంది. ఈ తరహా ఘటనలపై కూడా అవగాహన కార్యక్రమాలు అవసరమని కోరుతున్నారు.
ఈ ఘటన పట్ల చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులకు రక్షణ కల్పించాలన్సిన విద్యాసంస్థ నిర్వాహకులు, డ్రైవర్ నేరాలకు పాల్పడడం పట్ల మండిపడుతున్నారు. ఈ అనూహ్య ఘటన మరోసారి పిల్లల రక్షణపై భయాందోళన కలిగిస్తోంది. నిందితుడికి తక్షణమే కఠిన శిక్ష విధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications