త్వరలో టీవీ యాంకర్ అమృతతో దిగ్విజయ్ పెళ్లి?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తన ప్రియురాలు, ప్రముఖ టీవీ యాంకర్ అమృతా రాయ్‌ని త్వరలో పెళ్లి చేసుకోనున్నారా? అంటే అవుననే అంటున్నారు డిగ్గీ సోదరుడి సతీమణి. త్వరలో దిగ్విజయ్ సింగ్ తన ప్రేయసి అమృతా రాయ్‌ని వివాహం చేసుకోనున్నారట.
త్వరలోనే తమ ఇంట్లో పెళ్ళి బాజాలు మోగనున్నాయని దిగ్విజయ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ భార్య రుబినా శర్మ సామాజిక వెబ్‌సైట్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

ఓ టీవీ చానల్లో యాంకర్ అయిన అమృతారాయ్‌తో తాను ప్రేమాయణం నడుపుతున్నట్టు దిగ్విజయ్ కింగ్ కొద్ది రోజుల క్రితం బహిరంగంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఆమెను త్వరలో పెళ్ళాడబోతున్నట్టు కూడా ఆయన చెప్పారు.
అమృత, ఆమె భర్త పరస్పర అవగాహనతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, తమ బంధంలో సమస్యలేవీ లేవని ఆయన స్పష్టం చేశారు. దిగ్విజయ్ సతీమణి క్యాన్సర్ కారణంగా గత ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు. దిగ్విజయ్‌కు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.












Click it and Unblock the Notifications