నిజమే! మేం దిగజారాం: డిగ్గీ, వద్దంటామా?: డికె అరుణ
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి దిగజారిన మాట వాస్తవమేనని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ శనివారం అన్నారు. తెలంగాణలో తాము మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 16న అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.
వద్దంటామా?: అరుణ
వాస్తవ పరిస్థితులను చూస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 65 సీట్లు సాధించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డికె అరుణ అభిప్రాయపడ్డారు. ఆ సత్తా కేవలం ఒక్క కాంగ్రెస్‌కే ఉందన్నారు. 50 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మిగతా 15 సీట్లలో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉందన్నారు. మహిళలకు సిఎం పదవి ఇస్తే ఎందుకు వద్దంటామన్నారు. కచ్చితంగా మహిళలకు ఆ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రా ఉద్యోగులను హెచ్‌వోడీలుగా నియమించవద్దని తెరాస నేత శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. అలా నియమిస్తే ప్రచ్ఛన్న యుద్ధం తప్పదన్నారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు ఆంధ్రా అధికారిని నియమించడాన్ని తప్పుబట్టారు. ఇది విఘ్నులు చేయాల్సిన పని కాదన్నారు. అకాల వర్షాలతో పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. జిల్లాల్లో మునిసిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికస్థానాలు తెరాసవే అని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications