కేజ్రీవాల్‌పై డిగ్గీ సంచలనం, ఆ రోజు చెప్తే పిచ్చిపట్టిందన్నారు..
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రహిత భారత్ పేరుతో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ రూపొందించిన ప్రణాళికలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఓ భాగమని ఆరోపించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ ఓటర్లు రిక్త హస్తం చూపించడంపై దిగ్విజయ్ స్పందించారు. కాంగ్రెస్ నిర్మూలన కోసం ఆరెస్సెస్ రచించిన పకడ్బందీ ప్రణాళికలో కేజ్రీవాల్ భాగమేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్న తన పైన ఆరెస్సెస్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు తిట్ల వర్షం కురిపించినా, ఇదే నిజమన్నారు.

గతంలో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమం వెనుక కూడా ఆరెస్సెస్ హస్తముందని నాడు తాను చేసిన వ్యాఖ్యలను ఏ ఒక్కరూ నమ్మలేదన్నారు. తనకు పిచ్చి పట్టిందని వ్యాఖ్యానించారని, అయితే ఆ తర్వాత తన ఆరోపణల్లో వాస్తవం ఉందని తేలిందన్నారు.












Click it and Unblock the Notifications