ఆంధ్ర మాంసాహారంపై మనసు పారేసుకున్న డిగ్గీ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్టీలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడానికి హైదరాబాద్ వచ్చిన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ఆంధ్ర మాంసాహారాన్ని తలుచుకుంటూ ఉపవాసం చేశారు. ఆయన రెండు రోజుల పాటు హైదరాబాదులో ఉన్న విషయం తెలిసిందే. ఆంధ్ర మాంసాహారాన్ని రుచి చూడలేకపోయానని ఆయన ట్విట్టర్‌లో బాధపడ్డారు.
ఆంధ్ర మాంసాహారమంటే తనకు ఎంతో ఇష్టమని, గురువారం ఇక్కడే ఉన్నానని, అయితే ఈ రోజు మాంసాహారం ముట్టబోనని, శుక్రవారం ఏకాదశి కాబట్టి ఉపవాసమని ఆయన ట్వీట్ చేశారు. దిగ్విజయ్ ట్విట్టర్ వ్యాఖ్యలపై కొంత మంది పాఠకులు వ్యంగ్యంగా ప్రతిస్పందించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా నిన్ను భరిస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తోందని ఓ పాఠకుడు వ్యాఖ్యానించాడు. మీ ఏకాదశిని పక్కన పెట్టి, జన్ లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే మాదిరిగా దీక్ష చేస్తున్నానని చెప్పండని మరో వ్యక్తి వ్యాఖ్యానించారు. దిగజారిపోతన్న కాంగ్రెసు భాగ్యరేఖను బాగు చేయడానికి ఇది పనికి వస్తుందని కూడా సలహా ఇచ్చారు.
ఇక్కడున్నప్పుడు హైదరాబాద్ బిర్యానీని గుర్తు చేసుకోండని మరో పాఠకుడు వ్యాఖ్యానించారు. రాజ్‌పూత్‌ల నుంచి వచ్చినప్పటికీ మీరు తాగరని, ఏకాదశి ఉపవాసం చేస్తారని, గురువారాన్ని శాకాహారంగా పాటించే గొప్ప వ్యక్తి అని మరొకరు అన్నారు.












Click it and Unblock the Notifications