డిగ్గీ, అమృతా రాయ్ ఎఫైర్ ఫోటో: లీక్ ఎక్కడి నుండి?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, టీవీ యాంకర్ అమృతా రాయ్‌లు సన్నిహితంగా ఉన్న ఫోటోలు కొద్ది రోజుల క్రితం లీక్ అయిన విషయం తెలిసిందే. అమృతా రాయ్ మెయిల్ నుండి వీటిని ఎవరు హ్యాక్ చేసి, లీక్ చేశారనే విషయమై తెలుసుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో పోలీసులు ఈ కేసును చేధించనున్నారు.
కాగా, ఈ కేసును విచారిస్తున్న పోలీసులు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డిటెయిల్స్ తీసుకున్నారు. ఈ ఫోటోలు లీక్ కావడానికి ముందు అమృతా రాయ్‌కు వచ్చిన మెయిల్స్ తదితరాలను పోలీసులు సేకరించారు. అమృతా రాయ్ మెయిల్ హ్యాక్ చేసిన వారి గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఐపీ అడ్రస్‌లు తీసుకున్నారు.

ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అమృతా రాయ్ అకౌంట్‌కు యాక్సెస్ అయిన వారి ఐపీ అడ్రస్‌లను గూగుల్ నుండి విచారణాధికారులు తీసుకున్నారు. దాదాపు వెయ్యికి పోగా ఐపీ లాగ్స్ తీసుకున్నారు. ఇందులో ఢిల్లీ, చెన్నై, ముంబై తదితర నగరాలకు చెందిన అడ్రస్‌లు ఉన్నాయి.
వీటితో పాటు నెదర్లాండ్స్(ఆమ్‌స్టర్‌డమ్), పిలిప్పీన్స్ (మనీలా)ల అడ్రస్‌లు కూడా ఉన్నాయి. ఆ దిశలోను పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ప్రాంతాలలో అమృతా రాయ్ పర్యటించిందా అని తెలుసుకునేందుకు పోలీసులు ఆమెను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ అమృతా రాయ్ అకౌంట్‌కు యాక్సెస్ అయిన పలు అడ్రస్‌లు ఉన్నాయి.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications