bjp dinesh trivedi resigned rajya sabha mamata banerjee defections West Bengal Assembly Elections 2021 బిజెపి దినేష్ త్రివేది రాజ్యసభ మమతా బెనర్జీ ఫిరాయింపులు politics
దీదీకి షాక్ .. బెంగాల్ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన టీఎంసీ మాజీ ఎంపి దినేష్ త్రివేది
పశ్చిమ బెంగాల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పశ్చిమబెంగాల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈసారి పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ కి చెక్ పెట్టాలని బిజెపి శతవిధాలా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నాయకులను ఆపరేషన్ ఆకర్ష అంటుంది.

జెపి నడ్డా సమక్షంలో బిజెపిలో చేరిన మాజీ టీఎంసీ ఎంపీ
ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించిన సువేందు అధికారి, అటవీ శాఖా మంత్రి రాజీబ్ బెనర్జీ వంటి పలువురు నేతలు బిజెపికి జై కొడితే, తాజాగా మమతా బెనర్జీ షాక్ ఇస్తూ మరో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ పదవికి రాజీనామా చేసి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు . ఫిబ్రవరి 12వ తేదీన రాజ్యసభలో టిఎంసి ఎంపి పదవికి రాజీనామా చేసిన తృణమూల్ కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యుడు దినేష్ త్రివేది పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో బిజెపిలో చేరారు.

రాజ్యసభలోనే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి మమతా బెనర్జీకి షాక్ ఇచ్చిన నేత
కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా ఈ చేరిక సమయంలో అక్కడ హాజరయ్యారు. మూడోసారి రాజ్యసభలో పశ్చిమ బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించిన, మాజీ రైల్వే మంత్రిగా ఉన్న త్రివేది, కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాజ్య సభలోనే తన రాజీనామాను ప్రకటించారు . అప్పుడే టీఎంసీకి షాక్ ఇచ్చారు. తన రాష్ట్రంలో హింస గురించి మాట్లాడలేనని చెప్పారు. పశ్చిమబెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఫిరాయింపుల పర్వం జోరుగా సాగుతోంది.

నువ్వా నేనా అన్నట్టు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు .. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీజేపీ మైండ్ గేమ్
నువ్వా నేనా అన్నట్టు బిజెపి ,తృణముల్ కాంగ్రెస్ పార్టీలు తలపడుతున్నాయి. మమతా బెనర్జీ ఏమాత్రం బిజెపిని రాష్ట్రంలో అడుగుపెట్టనిచ్చేది లేదని తేల్చి చెప్తున్నారు. కానీ పశ్చిమబెంగాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు బిజెపి బలం పుంజుకునే అవకాశం కల్పిస్తున్నట్లుగా ఉన్నాయి.
ఈనెల 27 నుండి ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఎన్నికల సమయంలో మమతా బెనర్జీకి షాక్ ఇస్తూ బీజేపీ నేతలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారు.