• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

క‌నుమ‌రుగ‌వుతున్న కిచ‌కిచ‌లు..! ఇక‌నైనా పిచ్చుక‌ల‌ను తిరిగి తెచ్చుకుందాం...!!

|

హైద‌రాబాద్ : ఒకప్పుడు ఊర పిచ్చుకలు లేని ఊరులేదంటే అతిశయోక్తి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ వాడ చూసినా, ఏ ఇల్లు చూసినా గుంపులు గుంపులుగా ఊరపిచ్చుకలు దర్శనమిచ్చేవి. పిచ్చుకలు, మానవులు ఒకే కుటుంబసభ్యులుగా సహజీవనం చేసేవారు. మిగతా పక్షులకు భిన్నంగా ఊరపిచ్చుకల జీవితాలు మానవ జీవితాలతో పెనవేసుకున్నాయి. ఆహారం కోసం, నివాసం కోసం, గూడు కోసం పూర్తిగా మానవులపై ఆధారపడతాయి అవి. మనుషులతో సన్నిహితంగా మెలుగుతాయి. చిన్న చిన్న పురుగులు, ధాన్యం గింజలు తిని జీవిస్తాయి ఊరపిచ్చుకలు. ప్ర‌పంచ పిచ్చుకల దినోత్స‌వం సంద‌ర్బంగా వ‌న్ ఇండియా ప్ర‌త్యేక క‌థ‌నం..!

పెళ్ళిలో డబ్బు వెదజల్లిన ఘనుడు ... డబ్బు ఎక్కువైతే మాకివ్వరా బాబు అంటున్న నెటిజన్లు !

వేకువ‌జాము కిచ‌కిచ‌ల చ‌ప్పుడు..! మ‌న‌సుకు ఎంతొ ఆహ్లాదం..!!

వేకువ‌జాము కిచ‌కిచ‌ల చ‌ప్పుడు..! మ‌న‌సుకు ఎంతొ ఆహ్లాదం..!!

పొద్దున్నే పక్షుల కిలకిలలు వింటే ఎంత హాయిగా ఉంటుందో..! గాల్లో ఎగురుతూ గమ్మత్తయిన విన్యాసాలు చేస్తుంటే ఎంత ముద్దొస్తుంటుంది..! పిచ్చుకలు రక్షణ కోసం గడ్డితో నిర్మించుకున్న అందమైన గూడును చూస్తే ఆశ్చర్యమేయ‌క మాన‌దు. ఆనందానికి.. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే ఆ పిచ్చుకలు ఎక్కడున్నాయిప్పుడు? పర్యావరణ కాలుష్యం పిచ్చుకల ప్రాణాలు తీస్తున్నది! వాతావరణ మార్పులు వాటి ఉనికికి ప్రమాదకరంగా మారుతున్నాయి! నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. పిచ్చుకల్ని ప్రేమిద్దాం.. ఈ రోజు నుంచే ప్రారంభిద్దాం!

ఒక‌ప్పుడు సంద‌డి చేసే పిచ్చుక‌లు..! అంత‌రించిపోవ‌డం బాదాక‌రం..!!

ఒక‌ప్పుడు సంద‌డి చేసే పిచ్చుక‌లు..! అంత‌రించిపోవ‌డం బాదాక‌రం..!!

ఒకప్పుడు మన ఇంటి ముంగిట్లో పిచ్చుకల కిలకలారావాలు వినిపించేవి. ఇప్పుడు పిచ్చులన్నవే మాయమైపోతున్నాయి. మానవుడు కనిపెట్టిన సాంకేతిక పరిజ్ఞానం పిచ్చుకల మనుగడకు శాపంగా పరిణమించింది. సెల్ తరంగాల రేడియేషన్, కాలుష్యం కారణంగా ఇవి మన ముంగిట నుంచి కనుమరుగవుతున్నాయి. పీచుతో గూడు కట్టుకోవడం, నోటితో ఆహారాన్ని తెచ్చి పిల్లలకు అందివ్వడం, వాటిని జాగ్రతగా కాపాడటం లాంటివి చూసేవుంటాం. ఇవి తల్లి ప్రేమకు గుర్తుగా కనిపిస్తాయి. పిచ్చుకల అన్యోన్య జీవన విధానాన్ని గుర్తించిన ప్రపంచ దేశాలు మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.

ఇప్ప‌టికైనా పిచ్చుక జాతిని కాపాడుకుందాం..! తగు జాగ్ర‌త్త‌లు తీసుకుందాం..!!

ఇప్ప‌టికైనా పిచ్చుక జాతిని కాపాడుకుందాం..! తగు జాగ్ర‌త్త‌లు తీసుకుందాం..!!

పిచ్చుకల ఘనతను గుర్తించిన భారత ప్రభుత్వం గతంలో తపాలా బిళ్లను విడుదల చేసింది. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్బంగా వివిధ దేశాలు పిచ్చుకల మనుగడకు సంబంధించిన అంశాలపై చర్చించి, అవసరమైన చర్యలు చేపడుతుంటాయి. పిచ్చుకల సంరక్షణను ప్రోత్సహించేందుకు ఎన్ఎఫ్ఎస్ సంస్థ పిచ్చుకల అవార్డులను ప్రకటించింది. ఇదిలావుండగా గతంలో రైతులు జొన్న, సజ్జ తదితర సంప్రదాయ పంటలను సాగు చేస్తుండేవారు. వాటిని తిని పక్షులు జీవించేవి. అయితే ప్రస్తుతం పత్తి తరహా వాణిజ్య పంటలవైపు రైతులు మొగ్గు చూపిస్తుడడంతో పిచ్చుకలకు ఆహారం కరువైంది. అయితే కృతిమ రీతిలో పిచ్చుక గూళ్లను ఏర్పాటు చేసి, వాటిని సంరక్షించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

వీలైన చోట‌ పిచ్చుక‌లకు ఆశ్ర‌యం క‌ల్పించాలి..! కిచ‌కిచ‌ల‌ను తిరిగి తెచ్చుకోవాలి..!!

వీలైన చోట‌ పిచ్చుక‌లకు ఆశ్ర‌యం క‌ల్పించాలి..! కిచ‌కిచ‌ల‌ను తిరిగి తెచ్చుకోవాలి..!!

ప్రపంచ ఊర పిచ్చుకల రోజును పురస్కరించుకొని, పక్షి ప్రేమికులు, పర్యావరణ అభిమానులు అందరూ ఊరపిచ్చుకల పరిరక్షణకు నడుంకట్టాలి. పక్షి గూళ్లను కర్రతో చేసిన డబ్బాలాంటి గూళ్లను బాల్కనీలో వేలాడదీయాలి. కొద్ది రోజుల తర్వాత అవి మెల్లగా వాటిని గూడుగా మార్చుకుంటాయి. ఎండకాలంలో నీరు, ధాన్యం గింజలను సమకూర్చితే చాలు. పిచ్చుకల సందడి మళ్లీ మొదలవుతుంది. ప్రయత్నిద్దాం. తిరగి ఊర పిచ్చుకలతో స్నేహం చేద్దాం...! అంత‌రించిపోతున్న కిచ‌కిచ‌ల‌ను మ‌ళ్లీ విందాం..!

English summary
In the foreground of our home we hear sparrows. Now the little sparrows are disappearing. The human invented technology has become a scourge of sparrows survival. These are due to the radiation and pollution of cell waves.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more