డిసిప్లేన్: వెంకయ్య ప్రసంగిస్తుండగా వెనకే నిలబడ్డ మోడీ(వీడియో)
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మార్చి 9న లోక్‌సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగించే సమయంలో ప్రధాని సభలోకి ప్రవేశించారు.
అయితే ఆయన వెళ్లి వెంకయ్యనాయుడు ముందున్న తన సీటులో కూర్చోకుండా మంత్రి ప్రసంగం పూర్తయ్యేవరకూ ఎదురుచూశారు. వెంకయ్య ప్రసంగం పూర్తి చేశాకే ప్రధాని వెళ్లి తన సీటులో కూర్చున్నారు.
వెంకయ్య ప్రసంగిస్తుండగా వెళ్లి కూర్చోబోతే ఆయన ప్రసంగానికి అవాంతరం ఎదురయ్యే అవకాశం ఉందని ప్రధాని భావించారు. అందుకే ప్రసంగం పూర్తయ్యేదాకా వెనుకగానే నిల్చున్నారు.
కాగా, చిన్న చిన్న విషయాల్లో ప్రధాని చూపే శ్రద్ధ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఇటీవల తనకు వ్యతిరేకంగా పలుమార్లు నినాదాలు చేసి అలసిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్‌కు లోక్‌సభలో మంచినీళ్ల బాటిల్ అందించి మోడీ తన ప్రత్యేకతను చాటుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications