బుద్ధుడు అక్కడే జన్మించారా: లుంబినీలో చెక్క నిర్మాణం

పురావస్తు శాస్త్రజ్ఞులు తాజాగా గుర్తించిన నిర్మాణం మధ్యలో ఎక్కువ ఖాళీ స్థలం ఉండటం, అందులో ఓ పెద్ద చెట్టు వేర్లు లభ్యమయ్యాయి. దీంతో తల్లి మాయాదేవి బుద్ధుడికి ఇక్కడే జన్మనిచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
ఇక్కడ లభించిన బొగ్గు, ఇసుక రేణువుల కాలాన్ని రేడియోకార్బన్ విధానం, ఆప్టికల్లీ స్టిమ్యులేటెడ్ లుమినిసెన్స్ విధానాల ద్వారా పరీక్షించిన పురావస్తు శాస్త్రజ్ఞులు ఈ కట్టడం క్రీ.పూ.6వ శతాబ్దం నాటిదని తేల్చారు.
కొందరు శాస్త్రజ్ఞులు, చరిత్రకారుల అంచనా ప్రకారం బుద్ధుడు క్రీ.పూ.4వ శతాబ్దంలోని వారు కాగా, మరికొందరి ఉద్దేశం ప్రకారం క్రీ.పూ.మూడో శతాబ్దంలోని వారు. కానీ ఈ కట్టడం ప్రాచీనత వారందరి అంచనాలనూ తారుమారు చేసేసింది. బుద్ధుడు వారు ఊహించినదాని కన్నా రెండు శతాబ్దాలు వెనకటి వాడని తేలింది.
బుద్ధుడి జీవితంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ప్రాచీన ఆధారాన్ని కనుగొనడం ఇదే మొదటిసారి అని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. ఇక్కడ గతంలో ఒకచెట్టు ఉండేదని వారు వివరించారు. ఈమేరకు ఆ ప్రాంతంలో ఒక ప్రాచీన వృక్షానికి చెందిన వేర్లు ఉన్నట్టుగా వారు ద్రువీకరించుకున్నారు.












Click it and Unblock the Notifications