ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్భయ మాదిరిగానే దిశను చేయకండి.. రాష్ట్రపతి జోక్యం అంటూ ఎంపీ రఘురామరాజు ఆవేదన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో దిశ హత్యా ఘటన పార్లమెంట్‌ను కుదిపేసింది. రాజ్యసభ, లోక్‌సభలో సభ్యులు ఈ దుర్ఘటనపై ఆందోళన, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. ఇలాంటి ఘోరాలను ఎవరూ ఉపేక్షించకూడదు. నిందితులను కఠినంగా శిక్షించాలి. మహిళల భద్రతలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ రఘురామరాజుకు సభలో అవకాశం ఇవ్వగా, ఆయన మాట్లాడుతూ..

హైదరాబాద్‌లో జరిగిన దిశ లాంటి ఘోర ఘటనపై సభలో నా కొలీగ్స్ స్పందించారు. 2012 డిసెంబర్‌లో దేశరాజధానిలో బస్సులో దిశ లాంటి ఘటనే జరిగింది. ఆ కేసులో ఒక్కరే తనకు తాను ఉరిశిక్ష విధించ. మిగితా దోషులకు శిక్ష పడలేదు. అయితే వాళ్లు క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకొనే పనిలో ఉన్నారు. ఇలాంటి చర్యలను మనం ఒప్పుకోకుడదు అని వైసీపీ ఎంపీ రఘురామరాజు అన్నారు.

Disha in Loksabha: YSRCP MP Raghurama Raju concerns over Hyderabad incident

నిర్భయ ఘటన మాదిరిగానే కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో దిశ ఘటన అందర్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ర్యాలీలు, కొవ్వొతులతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఫాస్ట్ ట్రాక్ విచారణ అనే పేరుతో జాప్యం చేయకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కొన్ని రోజుల అంటే 30 రోజులు వ్యవధిలో దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి.

మహిళలపై జరుగుతున్న ఇలాంటి దారుణాలపై ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. దోషులకు వెంటనే శిక్షపడేలా చట్టాలు రూపొందించాలి. పార్లమెంట్ సభా సమావేశాలు ముగిసే లోపే మనమంతా రాష్ట్రపతికి విన్నపం చేద్దాం. నిందితులను కఠిన శిక్షపడేలా ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రపతిని కోరుదాం అని రఘురామరాజు సభలో తన ఆవేదనను వ్యక్తం చేశారు.

English summary
YSRCP MP Raghurama Raju concerns over Hyderabad incident. While speaking on Lok Sabha, He said Disha culprits must punished as soon as possible without ony delay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X