భార్యకు వాట్సాప్‌లో తలాక్: ఎఎంయూ ప్రోఫెసర్ సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

ఆగ్రా: ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిషేధం విధించినా కొందరు మాత్రం ఇంకా దానిని ఆచరిస్తూనే ఉన్నారు. ఆలీఘడ్ ముస్లిం యూనివర్శిటీ ప్రోఫెసర్ తన భార్యకు ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

ఆలీఘడ్ ముస్లిం యూనివర్శిటీ‌లో సంస్కృత భాషా విభాగానికి చైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్‌ ఖలీద్ బిన్ యూసఫ్ ఖాన్ తన భార్యకు వాట్సాప్‌ ద్వారా తలాక్‌ సందేశం పంపారు.

Divorced on WhatsApp: AMU professor gives triple talaq to wife over text

ఆపై మరో టెక్స్ట్ మెసేజ్ పెట్టి తలాఖ్ చెప్పాడు. అటుపై ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారు. డిసెంబర్ 11వ తేదీలోగా తనకు న్యాయం జరగకపోతే తన ముగ్గురు బిడ్డలతో కలిసి వీసీ ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు యాస్మీన్ ఖలీద్ హెచ్చరించారు.

న్యాయం కోసం తాను యూనివర్సిటీలోని క్రింది నుంచి పై స్థాయి అధికారుల వరకు అందర్నీ వేడుకుంటున్నానని, అయినా తనకు ఎవరూ సహాయపడడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వివాదంపై స్పందించిన ప్రొఫెసర్ ఖలీద్... తాను షరియత్ చట్టప్రకారం విడాకులు పొందానని అన్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ లతోపాటు ఇద్దరు సాక్షుల ఎదుట నోటి మాటల ద్వారా కూడా తలాక్ చెప్పానని పైగా నిర్ణిత కాల పరిమితిని కూడా పాటించినట్లు ఆయన చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman who has alleged that her husband, an AMU professor, has given her triple talaq had threatened to commit suicide if "justice is not done" to her.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి