వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Diwali: ఉచిత సలహాల మేధావులకు క్వీన్ కంగనా దీపావళి పంచ్, మీరు కార్లలో తిరగడం మానేయండి !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ రోజు దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో హిందువులు దీపావళి పండుగను వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకుంటున్నారు. దీపావళి పండుగ అంటేనే పిల్లలు టపాసులు (టపాకాయలు) కాల్చి ఆనందంగా పండుగ జరుపుకుంటారు. టపాసులు కాల్చడం వలనే దేశంలో కాలుష్యం పెరిగిపోతుందని, టపాసులు కాల్చడం పాతపద్దతి అని, ఇలాంటి పాత పద్దతులకు చెక్ పెట్టాలని కొందరు సమాజసేవకులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్న అలాంటి ఉచిత సలహాలు ఇచ్చే మేధావులకు ప్రముఖ బాలీవుడ్ నటి, క్వీన్ కంగనా రనౌత్ ఓ సలహా ఇచ్చారు. క్రాకర్స్ బ్యాన్ చెయ్యాలని మొత్తుకుంటున్న మేధావుల్లారా మీరు కారులో తిరగడం మానేయండి అంటూ క్వీన్ కంగనా వారికి సూచించారు. దీపావళికి టపాసులు కాల్చడం పాతపద్దతులు, కాలుష్యం పెరిగిపోతుంది అని చెబుతున్న మీరు కారులో తిరిగితే కాలుష్యం పెరిగిపోదా ?, మూడు రోజులు మీరు కూడా మీ ఆఫీసులకు కార్లలో వెళ్లకుండా ఉండాలని క్వీన్ కంగనా రనౌత్ సూచించారు. క్వీన్ కంగనా రనౌత్ దీపావళి పంచ్ కు ఉచిత సలహాలు ఇస్తున్న పనికిరాని మేధావులకు పంచ్ పడింది.

Sadist: రెండో భార్యతో ఎంజాయ్, ఫస్ట్ భార్య గర్బవతి, దిపావళి టైమ్ లో భార్యకు నిప్పంటించిన భర్త !Sadist: రెండో భార్యతో ఎంజాయ్, ఫస్ట్ భార్య గర్బవతి, దిపావళి టైమ్ లో భార్యకు నిప్పంటించిన భర్త !

దీపావళి అంటేనే టపాసులు కాల్చడం

దీపావళి అంటేనే టపాసులు కాల్చడం

దేశవ్యాప్తంగా ఈ రోజు దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో హిందువులు దీపావళి పండుగను వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకుంటున్నారు. దీపావళి పండుగ అంటేనే పిల్లలు కొత్త బట్టలు వేసుకుని టపాసులు (టపాకాయలు) కాల్చి ఆనందంగా పండుగ జరుపుకుంటారు. చిన్నపిల్లలు ఆనందంగా టపాసులు కాల్చుతుంటే వారి కుటుంబ సభ్యులు చూసి సంతోషంలో మునిగిపోతారు.

ఉచిత సలహాలు ఇస్తున్న మేధావులు

ఉచిత సలహాలు ఇస్తున్న మేధావులు

టపాసులు కాల్చడం వలనే దేశంలో కాలుష్యం పెరిగిపోతుందని, టపాసులు కాల్చడం పాతపద్దతి అని, ఇలాంటి పాత పద్దతులకు చెక్ పెట్టాలని కొందరు పనిపాటలేని సమాజసేవకులు ఉచిత సలహాలు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కష్టాల్లో ఉన్న పేదవారిని ఆదుకోవడానికి ఇలాంటి సమాజసేవకులు ముందుకురారు కాని, డబ్బు ఖర్చు కాని ఉచిత సలహాలు ఇవ్వడానికి ముందు వరుసలో ఉంటారు.

రూ. 1,000 బ్యానర్ ఒకటి వేసుకుని ఎగేసుకుని రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు

రూ. 1,000 బ్యానర్ ఒకటి వేసుకుని ఎగేసుకుని రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు

హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్న ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చే మేధావులు కేవలం హిందువుల పండుగలనే టార్గెట్ చేసుకుని మాట్లాడటం అనేక విమర్శలకు దారి తీస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. వెయ్యి రూపాయలు ఇచ్చి ఒక బ్యానర్ చేయించి దానిని పట్టుకుని రోడ్ల మీదకు పది మంది వచ్చి ఏదో దేశాన్ని ఉద్దరిస్తున్నామనే ఫీలింగ్ తో రెచ్చిపోతున్నారు. అదే ఆకలితో అలమటిస్తున్న వారిలో ఎంత మందికి వీరు అన్నం పెట్టి వారి ఆకలి తీరుస్తున్నారో అనే విషయం ఆ దేవుడికే తెలియాలి.

క్వీన్ కంగనా దీపావళి పంచ్

క్వీన్ కంగనా దీపావళి పంచ్

హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్న ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చే మేధావులకు ప్రముఖ బాలీవుడ్ నటి, క్వీన్ కంగనా రనౌత్ ఓ సలహా ఇచ్చారు. క్రాకర్స్ బ్యాన్ చెయ్యాలని మొత్తుకుంటున్న మేధావుల్లారా మీరు కొన్ని రోజులు కార్లలో తిరగడం మానేయండి, కాలుష్యం దానంతటికి అదే తగ్గిపోతుంది అంటూ క్వీన్ కంగనా రనౌత్ ఉచిత సలహాలు ఇస్తున్న మేధావులకు సూచించారు.

అనీల్ కపూర్ భార్య, ముంబాయి మేయర్ టార్టెట్ ?

అనీల్ కపూర్ భార్య, ముంబాయి మేయర్ టార్టెట్ ?

కొన్ని రోజుల నుంచి టపాసులు కాల్చడం వలన కాలుష్యం పెరిగిపోతున్నదని, టపాసులు కాల్చడం వీలైనంత వరకు మానేయాలని, ఈ విషయంలో ప్రతిఒక్కరూ ఆలోచించాలని ముంబాయి మేయర్ కిషోరి పెడ్నేకర్ ఇటీవల ప్రజలకు సూచించారు. ఇక అలనాటి నెంబర్ వన్ హీరో అనీల్ కుపూర్ భార్య, బాలీవుడ్ సినీ నిర్మాత రియా కపూర్ కూడా దీపావళి పండుగకు టపాసులు కాల్చడం పాత పద్దతి, ఇలాంటి పాత పద్దతులకు మనం చెక్ పెట్టాలని ఉచిత సలహా ఇచ్చారు. ఇలాంటి వారి మీద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండిపడ్డారు.

మూడు రోజులు మీరు కార్లలో తిరగకుండా ఉండండి చూద్దాం ?

మూడు రోజులు మీరు కార్లలో తిరగకుండా ఉండండి చూద్దాం ?


క్రాకర్స్ బ్యాన్ చెయ్యాలని మొత్తుకుంటున్న మేధావుల్లారా మీరు కారులో తిరగడం మానేయండి అంటూ క్వీన్ కంగనా వారికి సూచించారు. దీపావళికి టపాసులు కాల్చడం పాతపద్దతులు, కాలుష్యం పెరిగిపోతుంది అని చెబుతున్న మీరు కార్లలో తిరిగితే కాలుష్యం పెరిగిపోదా ?, తిగ్గిపోతుందా చెప్పండి ?, కేవలం మూడు రోజులు మీరు కూడా మీ ఆఫీసులకు కార్లలో వెళ్లకుండా ఉండాలని, వేరే మార్గాలు అన్వేషించుకోవాలని దీపావళి పండుగకు టపాసులు కాల్చకూడదని ఉచిత సలహాలు ఇస్తున్న వారికి క్వీన్ కంగనా రనౌత్ సూచించారు.

 లక్షల మొక్కలు నాటిన సద్గురు వాసుదేవ్ ఏం చెప్పారు !

లక్షల మొక్కలు నాటిన సద్గురు వాసుదేవ్ ఏం చెప్పారు !

సద్గురు వాసుదేవ్ గురూజీ ఇంత వరకు కొన్ని లక్షల మొక్కలు నాటారని ఇదే సమయంలో కంగనా రనౌత్ గుర్తు చేశారు. సద్గురు వాసుదేవ్ గతంలో మాట్లాడిన వీడియో క్లిప్ ను కంగనా రనౌత్ ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. లక్షలు మొక్కలు నాటిన సద్గురు వాసుదేవ్ కూడా చిన్నతనంలో దీపావళి పండుగకు టపాసులు కాల్చానని చెప్పారని, చిన్నపిల్లలు టపాసులు కాల్చుకుంటే వారి తల్లిదండ్రుల కళ్లల్లో కనపడే ఆనందం. సంతోషం గురించి వర్ణించలేమని చెప్పారని నటి కంగనా రనౌత్ గుర్తు చేశారు.

Recommended Video

అనేక ఆకృతుల్లో కనువిందు చేస్తున్న దీపాలు వెలిగించే ప్రమిదలు!! || Oneindia Telugu
కంగనా రనౌత్ సలహాను పాటిస్తారా మేధావుల్లారా ?

కంగనా రనౌత్ సలహాను పాటిస్తారా మేధావుల్లారా ?

మీరు కేవలం మూడు రోజులు కార్లలో తిరగకుండా ఉన్న తరువాత దీపావళి పండుగకు టపాసులు కాల్చకూడదని ఉచిత సలహాలు ఇవ్వాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండిపడ్డారు. ఇలాంటి దీపావళని పండుగను టపాసులు కాల్చకుండా ఊహించుకోవడం కష్టం అని కంగనా రనౌత్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Diwali: Bollywood actress Kangana Ranaut has an advice for the environmental activists who are concerned about pollution with the bursting of firecrackers during Diwali.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X