రవి కేసు: నిజం వెల్లవడవుతుందన్న తల్లి, మామ స్పందన (పిక్చర్స్)
బెంగళూరు: ఐఎఎస్ అధికారి డి.కే. రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు స్పందించారు. రవి కేసు సీబీఐ కి అప్పగిస్తున్నామని సిద్దరామయ్య సోమవారం ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనల విరమణ జరిగింది. రవి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలంటే సీబీఐ దర్యాప్తు కరెక్ట్ అని అంటున్నారు.
మార్చి 16వ తేదిన సోమవారం కోరమంగల సమీపంలోని అపార్ట్ మెంట్ లో ఐఏఎస్ అధికారి రవి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ప్రతిపక్షాలు ఢిల్లీలో ధర్నా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
రవి కుటుంబ సభ్యులు విధాన సౌధ ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని సిద్దరామయ్యను హెచ్చరించారు. సోంత పార్టీలోని కొందరు నాయకులు సోనియాగాంధికి ఫిర్యాదులు చెయ్యడంతో సిద్దు హడలిపోయారు. చివరికి సిద్దరామయ్య తీసుకున్న నిర్ణయంపై పలువురు ఈ విధంగా స్పందించారు.

నిజం బయటపడుతుంది: రవి మామ
రవి నిజాయితి కలిగిన అధికారి. అతను తన అల్లుడు అని చెప్పడం లేదు. అతని పనితీరు అందరికి తెలుసు అని రవి మామ హనుమంతరాయప్ప అన్నారు. రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని మేము డిమాండ్ చేశాం. రవి మరణానికి ఎవరు కారణం అని అన్ని వెలుగు చూస్తాయి.

చావుతో రాజకీయం చెయ్యం: కుమారస్వామి
చావును అడ్డు పెట్టుకుని తాను రాజకీయం చెయ్యనని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. రవి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని తాము సీబీఐ దర్యాప్తు కు డిమాండ్ చేశామని చెప్పారు. రవి కుటుంబ సభ్యులను విదాన సౌధ దగ్గరకు పిలిపించి నేను ధర్నా చేయించాను అని చెప్పడం సిగ్గుచేటు అన్నారు.

ఆరు కోట్ల మంది విజయం: జోషి
సిన్సియర్ ఐఏఎస్ అధికారి డి.కే. రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించడం సంతోషకరం, నిజాలు ఇప్పుడు వెలుగు చూస్తాయి. వారం రోజుల పాటు పోరాటం చేసిన వారితో పాటు రాష్ట్రంలోని ఆరు కోట్ల మంది విజయం అని బీజేపీ కర్ణాటక శాఖ రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి అన్నారు.

మా బిడ్డ చావుకు కారణాలు బయటపడుతాయి: .గౌరమ్మ
మా బిడ్డ చావుకు అసలు కారణాలు ఏమిటి అనే విషయం బయటపడుతాయని ఐఏఎస్ అధికారి రవి తల్లి గౌరమ్మ చెప్పారు. సీబీఐ దర్యాప్తుతో మాకు న్యాయం జరుగుతుందని అంటున్నారు.

వారం రోజులు నానబెట్టారు: శెట్టర్
ఐఏఎస్ అధికారి డికే రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించడానికి ప్రభుత్వం వారం రోజులు ఎందుకు నానబెట్టిందని శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల డిమాండ్ చెయ్యడంతో ప్రభుత్వం దిగివచ్చిందని చెప్పారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications