మృతదేహాలను దగ్గరగా చూశా- తట్టుకోలేకపోయా: కన్నీరు పెట్టుకున్న డీకేశి
Bengalur stampede: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకున్న సందర్భంగా నిర్వహించ తలపెట్టిన విజయోత్సవ ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనను కర్ణాటక హైకోర్టు తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. సుమోటోగా ఈ కేసును స్వీకరించింది.
ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు దీనిపై సమగ్ర విచారణ చేపట్టనుంది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ ఓ ప్రకటన విడుదల చేశారు. 11 మంది దుర్మరణానికి దారి తీసిన ఈ ఘటనలో వైఫల్యం ఎవరిదనే విషయంపై హైకోర్టు విచారణ జరుపనుంది. ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలనే విషయంపై మార్గదర్శకాల రూపకల్పన వంటి అంశాలు విచారణకు రానున్నట్లు తెలుస్తోంది.

తొక్కిసలాట ఘటన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను తీవ్రంగా కదిలించింది. దుర్ఘటన చోటు చేసుకున్న తరువాత ఆయన హుటాహుటిన బౌరింగ్ ఆసుపత్రికి వెళ్లారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. రాత్రి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్వహించిన విలేకరుల సమావేశానికి హాజరయ్యారు. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలనే అంశంపై సమీక్ష సైతం నిర్వహించారు.
ఈ ఉదయం బెంగళూరు నగర పోలీస్ కమిషన్ దయానంద, హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ ఉదంతాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకున్న నేపథ్యంలో.. ఎలాంటి వాదనలు వినిపించాలి?.. ప్రభుత్వం ఎలాంటి స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొటోకాల్స్ ను రూపొందించాలి? అనే విషయంపై చర్చించారు. హోం శాఖ మంత్రి జీ పరమేశ్వరప్పతో సంప్రదింపులు మాట్లాడారు.
తొక్కిసలాటకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. తమ పిల్లల మరణాన్ని ఏ కుటుంబం కూడా జీర్ణించుకోలేదని వాపోయారు. 11 మంది మృతదేహాలను కళ్లారా చూశానని, తట్టుకోలేకపోయానని, చనిపోయిన వారిలో 15 సంవత్సరాల వయస్సున్న పిల్లలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై ప్రజలకు క్షమాపణ చెబుతున్నామని, ఇందులో ఎవ్వరినీ నిందించదలచుకోలేదని డీకే శివకుమార్ చెప్పారు. 35,000 సీట్ల సామర్థ్యం ఉన్న చిన్నస్వామి స్టేడియానికి మూడు లక్షల మంది తరలివస్తారని ఎవరూ ఊహించలేదని అన్నారు. జనం తాకిడికి స్టేడియం గేట్లు విరిగిపోయాయని, గోడలు కూలిపోయాయని పేర్కొన్నారు.
విధానసౌధ వద్ద ప్లేయర్ల సన్మాన కార్యక్రమ సమయానికే ఇద్దరు మరణించినట్లు పోలీస్ కమిషనర్ దయానంద చెప్పాడని, 10 నిమిషాల్లో కార్యక్రమం ముగించాలని కోరారని చెప్పారు డీకేశి. మృతుల సంతాప సూచకంగా రెండు రోజుల పాటు అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నట్లు డీకే వివరించారు. మున్ముందు- ఇలాంటి సందర్భాలు, పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించాలనే విషయంపై స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొటోకాల్స్ ను రూపొందిస్తామని, ఈ దిశగా కసరత్తు మొదలు పెట్టామని అన్నారు.
ఇదే విషయంపై జీ పరమేశ్వరప్ప స్పందించారు. ఈ ఈవెంట్ ను నిర్వహించాలని తాము ఆర్సీబీ మేనేజ్ మెంట్ ను ఉద్దేశపూరకంగా కోరినట్లు వస్తోన్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. ఇది పూర్తిగా ఫ్రాంఛైజీ నిర్ణయమేనని, ముఖ్యఅతిథులుగా పాల్గొనాలని ప్రభుత్వాన్ని కోరిందని చెప్పారు. ఆర్సీబీ ఫ్రాంఛైజీ విజ్ఞప్తి మేరకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పాల్గొన్నారని పేర్కొన్నారు.
ఈ ఉదయం ఆయన చిన్నస్వామి స్టేడియాన్ని సందర్శించారు. బెంగళూరు నగర పోలీస్ కమిషనర్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో అక్కడే సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎస్ఓపీని రూపొందించనున్నట్లు తెలిపారు. అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడం.. తొక్కిసలాటకు దారి తీసిందని అన్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications