బెంగళూరు సిటీ విషయంలో డీకే సంచలన వ్యాఖ్యలు, మేము జోక్యం చేసుకోము !
బెంగళూరు: బెంగళూరు (Bengaluru)నగరంలోని ప్రధాన డ్రైనేజ్ లు ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించారని, వాటిని తొలగించేందుకు ప్రభుత్వం పూర్తి బాధ్యతను అధికారులకే అప్పగించింది. కాలువలను ఆక్రమించి అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ అధికారులకు (BBMP) ఉందని అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు.
ఇందుకు సంబంధించి శనివారం మీడియా తో డీకే శివకుమార్ మాట్లాడారు. బీబీఎంపీ ద్వారా రాజకాలువల ఆక్రమణల తొలగింపు పనులు ఇంకా ఆగలేదా అని మీడియా ప్రశ్నించగా ఆ పనులు ఆపదిలేదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. యుద్ద ప్రాతిపదికన అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు డీకే శివకుమార్ (dk shivakumar) తెలిపారు. వచ్చే నవంబర్‌లోగా బెంగళూరు (Bengaluru)నగరంలోని అన్ని రహదారుల్లోని గుంతలను సరిచేయాలని అధికారులకు సూచించామని డీకే శివకుమార్ చెప్పారు.

ఎక్కడెక్కడ రోడ్‌బ్లాక్‌లు ఉన్నాయో గుర్తించి సమాచారం అందించేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. ఈ బాధ్యతను నిర్వహించేందుకు ట్రాఫిక్ పోలీసులు, బెంగళూరు (Bengaluru) కార్పొరేషన్ అధికారులు (BBMP) కలిసి పనిచేయాలని ఆదేశించామని డీకే శివకుమార్ తెలిపారు. ఇందుకు అవసరమైన గ్రాంట్లను విడుదల చేయనున్నట్లు డీకే శివకుమార్ తెలిపారు.
బెంగళూరు (Bengaluru)సిటీలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ కారణంగా పెరిఫెరల్ రోడ్డుకు డిమాండ్ పెరిగిందని, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఇస్తామని డీకే శివకుమార్ (dk shivakumar) అన్నారు. పీఆర్ఆర్ (PRR) పథకానికి కొన్ని చట్టపరమైన చిక్కులను కలిగి ఉందని, కాబట్టి ఆలస్యం అయిందని, లేకుంటే ఈపాటికే ప్రారంభమై ఉండేదని, చట్టానికి అతీతంగా పని చేయలేమని, న్యాయపరమైన చర్యలు తీసుకుని పని చేస్తామని డీకే శివకుమార్ (dk shivakumar) చెప్పారు.

బెంగుళూరులో (Bengaluru) వారంలో మూడు రోజులు భారీ ట్రాఫిక్ ఉందని, దీనిని అరికట్టడానికి మెట్రో, ఇతర రవాణా వ్యవస్థలను అనుసంధానించే ప్రాజెక్ట్ అవసరం ఉందని డీకే శివకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల సమయాన్ని రోడ్లపై వృధా చేయడాన్ని మా ప్రభుత్వం అంగీకరించదని, బెంగళూరు ఆదాయంలో ఐదవ వంతు ఔటర్ రింగ్ రోడ్ పనులకు ఉపయోగిస్తామని డీకే శివకుమార్ వివరించారు.












Click it and Unblock the Notifications