మమ్మల్ని ప్రధాని మోదీ ఫాలో అవుతున్నారు, చాలా సంతోషం, డీకే సెటైర్లు అంతే !
బెంగళూరు: ఎల్ పీజీ సిలిండర్ ధర రూ. 200 సబ్సిడీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది, గ్యాస్ రేట్ తగ్గించినందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, బీజేపీ ఎక్కువ క్రెడిట్ తీసుకుంటోంది కదా? అని మేము అనుకోవడం లేదని, కర్ణాటకను ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.
ఈ విషయమై డీసీఎం డీకే శివకుమార్ బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఉచిత పథకాల కారణంగా కర్ణాటక దివాళా తీస్తుందని ప్రధాని మోదీ ఆరోజు అన్నారని గుర్తు చేశారు. మహారాష్ట్రలో రూ. 1,500 ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ. 200 సబ్సిడీ ఎందుకు ఇచ్చారు. ప్రజలు బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీకి సర్వే నివేదిక వెళ్లిందని, కాంగ్రెస్ వాళ్లు ఉచితంగా ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రజలు బీజేపీ నాయకులను అడుగుతున్నారని, అందుకే గ్యాస్ ధరపై రూ. 200 సబ్సిడీ ఇస్తున్నారని డీకే శివకుమార్ తెలిపారు.

మన దేశంలోని అమ్మాయిలు, మహిళలు కర్ణాటకలో మహిళలకు అందుతున్న సదుపాయాలు అన్ని కావాలని ఎదురు చూస్తున్నారని, మా ఒత్తిడికి తలొగ్గి ప్రధాని నరేంద్ర మోదీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 200 తగ్గించారని, మేము రూ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పామని, ఇప్పుడు మహిళలకు ఉచితంగా రూ. 2 వేలు ఇస్తున్నామని, మహిళల ఖాతాలోకి డబ్బు చేరుతుందని డీకే శివకుమార్ అన్నారు
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతోందని, కర్ణాటకలోని మహిళలు అందరికి ఇళ్లకే డబ్బు చేరుతోందని డీకే శివకుమార్ అన్నారు. బీజేపీ ఛార్జిషీట్ విడుదల చేయడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. బీజేపీ చేస్తున్న ఆరోపణలలో నిజం ఎంత ఉంది అని నిరూపించాలని డీకే శివకుమార్ సవాలు విసిరారు.

ఇంతవరకు కర్ణాటకలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోలేని పరిస్థితిలో బీజేపీ ఉందని, కాంట్రాక్టర్ల గురించి వారు నాపై ఆరోపణలు చేశారని, నేను వారికి సవాలు చేశానని, అయినా వారు నామీద వచ్చిన ఆరోపణలకు సాక్షాలు సమర్పించలేకపోయారని డీకే శివకుమార్ అన్నారు. నాపై వచ్చిన ఆరోపణలను నిరూపించిన తర్వాత నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని డీకే శివకుమార్ బీజేపీ నాయకులకు సవాలు విసిరారు.
100 రోజుల్లో నాలుగు హామీలు అమలు చేశాం.. తొలి కేబినెట్ లోనే అన్ని హామీలను పరిష్కరించాం. మేము కాకుండా ఎవరైనా ఇలా చేశారా? అని డీకే శివకుమార్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు. డీకే శివకుమార్ 10 నుంచి 15 శాతం కమీషన్ అడిగారని, కాంట్రాక్టర్లను బెదిరించారని బీజేపీ నాయకులు ఆరోపించారని, ఆ తర్వాత మేం పోలీసులకు గానీ, గవర్నర్‌కు గానీ ఫిర్యాదు చేయలేదని అదే కాంట్రాక్టర్ నిజం చెప్పాడని, దీన్ని బట్టి తనను వీళ్లు ఎంత టార్గెట్ చేశారో అర్థం అవుతోందని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ బీజేపీ నాయకుల మీద మండిపడ్డారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications