తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్న డీకే, సీబీఐ కేసులో స్టే ఇచ్చిన హైకోర్టు !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ మీద నమోదు అయిన ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో ఆయన తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్నారు. తన మీద నమోదు అయిన సీబీఐ కేసును కొట్టి వెయ్యాలని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటక హైకోర్టుకు మనవి చేశారు. అయితే సీబీఐ నమోదు చేసిన కేసు కొట్టి వెయ్యడానికి హైకోర్టు నిరాకరించింది.
కేసు కొట్టి వెయ్యడానికి నిరాకరించిన హైకోర్టు కేసు దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. జులై 17వ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది. హైకోర్టు ఆదేశాలతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్నారు. కర్ణాటకలో గతంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన మీ కక్ష సాదింపు చర్యలో భాగంగా విచారణకు ఆదేశించిందని, ఆ సమయంలో తన మీద సీబీఐ నమోదు చేసిన కేసులు కొట్టి వెయ్యాలని డీకే శివకుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

కర్ణాటక హైకోర్టు ఏకసభ్య బెంచ్ 2023 ఏప్రిల్ 20వ తేదీన డీకే శివకుమార్ పిటిషన్ విచారణ చేశారు. డీకే శివకుమార్ మీద నమోదు సీబీఐ నమోదు చేసిన కేసు కొట్టి వెయ్యడానికి నిరాకరించిన కర్ణాటక హైకోర్టు డీకే పిటిన్ కొట్టివేసింది. కర్ణాటక హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డీకే శివకుమార్ హైకోర్టు ద్విసభ్య బెంచ్ ను ఆశ్రయించారు.
కర్ణాటక హైకోర్టు ద్విసభ్య బెంచ్ న్యాయమూర్తులు డీకే శివకుమార్ పిటిషన్ ను విచారణ చేశారు. డీకే శివకుమార్ మీద నమోదు అయిన సీబీఐ కేసును కొట్టి వెయ్యడానికి హైకోర్టు ద్విసభ్య బెంచ్ నిరాకరించింది. కేసు విచారణ జులై 17వ తేదీకి వాయిదా వేస్తున్నామని, అంత వరకు కేసు విచారణ చెయ్యకూడాదని కర్ణాటక హైకోర్టు సీబీఐకి సూచించింది. డీకే శివకుమార్ మీద నమోదు అయిన కేసును సీబీఐ అధికారులు విచారణ చెయ్యకుండా కర్ణాటక హైకోర్టు స్టే ఇచ్చింది.
ఆగస్ట్ 2వ తేదీ 2017లో డీకే శివకుమార్ కు అధికారులు సినిమా చూపించారు. మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న డీకే శివకుమార్‌కు చెందిన వివిధ ప్రదేశాలల్లోని కార్యాలయాలు, ఆయన ఇంటిలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో డీకే. శివకుమార్ ఇల్లు, కార్యాలయాల్లో రూ. 8.59 కోట్ల నగదు దొరికింది.
డీకే శివకుమార్ కు చెందిన మరో ఫ్లాట్ లో రూ. 41 లక్షల రూపాయలు ఐటీ అధికారులకు చిక్కింది. దీనిపై ఆదాయపన్ను శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శివకుమార్‌పై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసుల్లోనే డీకే శివకుమార్ ను 2019 సెప్టెంబర్ 3వ తేదీన అరెస్టు చేసి జైలుకు పంపించారు.
ఆతర్వాత సెప్టెంబర్ 9వ తేదీ 2019లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుండి వచ్చిన లేఖ ఆధారంగా అప్పటి కర్ణాటక ప్రభుత్వం (బీజేపీ అవినీతి నియంత్రణ చట్టం కింద డీకే శివకుమార్ మీద దర్యాప్తు చేయడానికి సీబీఐకి అనుమతించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేఖలోని అంశాలను ఉటంకిస్తూ అప్పటి కర్ణాటక ప్రభుత్వం విచక్షణ లేకుండా సీబీఐ విచారణకు అనుమతించిందని డీకే శివకుమార్ ఆరోపిస్తున్నారు.
దీని ఆధారంగా సీబీఐ అధికారులు డీకే శివకుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. చట్టాన్ని దుర్వినియోగం చేసి కేసులు నమోదు చేశారని డీకే శివకుమార్ తరఫు సీనియర్ న్యాయవాది కోర్టులో వాదించారు. దానిని ఏకసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. మరోవైపు సీబీఐ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించడంతో కేసు ఇంకా విచారణకు రాలేదు. ఏప్రిల్ 1, 2013 నుండి ఏప్రిల్ 30, 2018 మధ్య శివకుమార్ మరియు అతని కుటుంబ సభ్యులు రూ. 74.8 కోట్ల అక్రమ ఆస్తులు సంపాధించారని, ఆ ఆస్తులకు వాళ్లు తగిన పత్రాలతో ఇవ్వడంలో విఫలం అయ్యారని సీబీఐ వాదిస్తోంది.
-
రాజీనామాకు సిద్ధమైన సీఎం!, కానీ కండిషన్స్ ఇవే! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications