48 స్కూల్స్ టార్గెట్, వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కోండి, డీసీఎం, హోమ్ మంత్రి ఎంట్రీ, మ్యాటర్ !

బెంగళూరులోని పాఠశాలలకు నకిలీ బాంబు బెదిరింపు ఇమెయిల్ పంపించారు. బెంగళూరులోని పలు స్కూల్స్ లో బాంబులు పెట్టారని బెదిరింపులు రావడంతో సంబంధిత పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు గురైనారు. భద్రతా కారణాల దృష్ట్యా బెంగళూరులోని దాదాపు 50 శాతం పాఠశాల యాజమాన్యం పిల్లలను ఇంటికి పంపించింది. బెంగళూరులో ఒకేసారి 48 స్కూల్స్ కు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.

శుక్రవారం చాలా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. బెదిరింపులకు గురైన పాఠశాలల జాబితా 48 స్కూల్స్ కావడంతో ఆ స్కూల్స్ పేర్లు మీడియాలో వైరల్ అయ్యాయి. బాంబు బెదిరింపులు వచ్చిన స్కూల్స్ చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళనకు గురైనారు. శుక్రవారం బెంగళూరులో ఎక్కడ చూసినా బాంబు బెదిరింపు ఈ మెయిల్ గురించి జోరుగా చర్చ జరిగింది.

DK Sivakumar, Home Minister Parameshwar hold talks with police after receiving bomb threats to 48 schools in Bengaluru

పాఠశాలల్లో బాంబులు పెట్టారని బెదిరింపు లేఖలు వచ్చాయి అనే విషయం తెలిసిన వెంటనే కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ఇంటి సమీపంలోని పాఠశాలకు వెళ్లి ఆ స్కూల్ లోని ఉద్యోగులు, పోలీసులతో పాటు ఆయన కూడా తనిఖీలు నిర్వహించారు. ఇంట్లోనే తాను టీవీలో స్కూల్ లో బాంబులు పెట్టారని బెదిరించారని వార్తలు చూశానని, మా ఇంటి ముందే స్కూల్ ఉంది, అది చూసి తాను షాక్ అయ్యానని డీకే శివకుమార్ మీడియాకు చెప్పారు.

వెంటనే వచ్చి పోలీసులతో మాట్లాడాను. ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపుల లేఖ వచ్చింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారని, ప్రాథమిక సమాచారంతో చూస్తే అది నకిలీ బాంబు బెదిరింపుగా కనిపిస్తోందని, కొందరు వ్యక్తులు కావాలనే ఇలా చేస్తున్నారని, కానీ మనం దానిని నిర్లక్షం చేస్తే ఎప్పుడో ఒకసారి నిందితులు నిజంగానే దాన్ని నిజం చేస్తే అప్పుడు లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాలసి వస్తోందని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

DK Sivakumar, Home Minister Parameshwar hold talks with police after receiving bomb threats to 48 schools in Bengaluru

అప్పుడప్పుడూ ఇలాంటి తప్పుడు సమాచారం ఇస్తుంటారు, మనం దేనిని నిర్లక్ష్యం చేయకూడదు, పోలీసులు అన్నింటినీ తనిఖీ చేశారు, మన సైబర్ క్రైమ్ పోలీసులు సమర్థులని, నిందిుతలు ఎవరో కనిపెడతారని, బెంగళూరు నగర పోలీసు కమీషనర్ దయానంద్ తో పాటు బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీతో తాను మాట్లాడానని, త్వరలో నిందితులను పట్టుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారని డీకే శివకుమార్ వివరించారు.

బెంగళూరులోని పాఠశాలల్లో బాంబు బెదిరింపుల ఘటనపై కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి. దయానంద్, బెంగళూరు రూరల్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. బెదిరింపు కాల్‌లు వచ్చిన అన్ని ప్రాంతాలకు సీఐడీ అధికారి, సిబ్బంది, అన్ని స్క్వాడ్‌లను పంపించాలని, జాగ్రత్తగా ఉండాలని కర్ణాటక హెమ్ శాఖా మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ సంబంధిత పోలీసుల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+