డీఎంకె దిగ్గజ నేత అన్బళగన్ కన్నుమూత..
డీఎంకె పార్టీకి 43 ఏళ్ల సుదీర్ఘ కాలం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అన్బళగన్(97) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు డీఎంకె అధినేత స్టాలిన్ అన్బళగన్ మరణాన్ని ధ్రువీకరించారు. ఆయన మరణం పార్టీ శ్రేణుల్లో విషాదం నింపింది.
అన్బళగన్ దివంగత డీఎంకె అధినేత కరుణానిధికి అత్యంత సన్నిహితులు. 1944-1957 వరకు పచయప్ప కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో లెక్చరర్‌గా పనిచేసినందువల్ల అంతా ఆయన్ను పెరాసిరియార్(ప్రొఫెసర్) అని పిలిచేవారు. 1977 నుంచి 9 సార్లు డీఎంకె ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేశారు. 9 సార్లు ఎమ్మెల్యేగా,ఒకసారి ఎంపీగా ,తమిళనాడు మాజీ ఆర్థికమంత్రిగా సేవలందించారు. ఆయన లెక్చరర్‌గా కూడా చేశారు.

Recommended Video

అన్బళగన్ మరణానికి డీఎంకె సంతాపం ప్రకటించింది. ఒక వారం పాటు పార్టీ కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసింది. అలాగే ఒకవారం పాటు డీఎంకె కార్యాలయాల్లో పార్టీ జెండాను అవనతం చేయనున్నారు.












Click it and Unblock the Notifications