విజయ్ పార్టీ అంటే త్రిష, కీర్తి సురేష్
తమిళనాడులో హీరో విజయ్ కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. తమిళ వెట్రి కజగం అనే పేరిట విజయ్ తమిళనాడులో తన రాజకీయ పార్టీని స్థాపించారు. భారీ జనసందోహం మధ్య విజయ్ తన తొలి రాజకీయ ప్రసంగంతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి విజయ్ సన్నద్ధం అవుతున్నారు.అయితే విజయ్ పార్టీపై రాజకీయ ప్రత్యర్ధులు విమర్శలు గుప్పిస్తున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీపై అధికార పార్టీకి చెందిన కొందరు విమర్శల జోరును కొనసాగిస్తున్నారు. డీఎంకే నేత, మంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే అంటే 'త్రిష, విజయ్, కీర్తి సురేష్' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు మంత్రి.

సినిమాల్లో నటించే వారంతా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని ఏలాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. బ్లాక్ టికెట్లు అమ్ముకునే వ్యక్తి అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాకుండా, సొంత డబ్బులతో కాకుండా బ్లాక్ మనీతో జీతాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు విజయ్ అభిమానులకు ఆగ్రహం తెప్పించగా, రాజకీయ వర్గాల్లో మాత్రం నవ్వులు పూయిస్తున్నాయి. మంత్రి చేసిన ఈ సెటైర్లు టీవీకే పార్టీని తక్కువ చేసి చూపే ప్రయత్నంగా కొందరు భావిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది రాజకీయ విమర్శల్లో ఒక భాగం అంటున్నారు. ఏది ఏమైనా, ఈ వ్యాఖ్యలు మాత్రం తమిళ రాజకీయాల్లో హీట్ పెంచాయి అనడంలో సందేహం లేదు. రానున్న రోజుల్లో ఈ వివాదం ఇంకెలా మలుపు తిరుగుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications