వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత మృతిపై స్టాలిన్ సంచలనం: చికిత్సపై అనుమానాలు, శశికళపై ఒత్తిడి!

డిఎంకే ముఖ్య నేత స్టాలిన్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి పైన అనుమానాలు వ్యక్తం చేశారు. జయలలితకు అందిన చికిత్స పైన శ్వేతపత్రం విడుదల చేయాలని స్టాలిన్ గురువారం నాడు డిమాండ్ చేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: డిఎంకే (ద్రవిడ మున్నేట్ర కజగం) ముఖ్య నేత స్టాలిన్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి పైన అనుమానాలు వ్యక్తం చేశారు. జయలలితకు అందిన చికిత్స పైన శ్వేతపత్రం విడుదల చేయాలని స్టాలిన్ గురువారం నాడు డిమాండ్ చేశారు. సీఎంకు ఎలాంటి చికిత్స చేశారన్న దాని పైన అనుమానాలు ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు.

శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్

శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్

జయలలితకు అందిన చికిత్స పైన శ్వేతపత్రం విడుదల చేయాలని స్టాలిన్ గురువారం నాడు డిమాండ్ చేశారు. సీఎంకు ఎలాంటి చికిత్స చేశారన్న దాని పైన అనుమానాలు ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు.

పలువురి అనుమానాలు

పలువురి అనుమానాలు

జయలలిత మృతి పైన పలువురు అనుమానం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రముఖ సినీ నటి గౌతమి, అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ పుష్పలతో పాటు పలువురు ఆమె మృతి పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా స్టాలిన్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

శశికళ చేతికే పార్టీ పగ్గాలు!

శశికళ చేతికే పార్టీ పగ్గాలు!

కాగా, అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టేందుకు జయలలిత నెచ్చెలి శశికళ సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సహా ముఖ్య నేతలు, పార్టీలోని ఎక్కువ మంది ఆమె వైపు ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆమె పగ్గాలు చేపట్టే ప్రకటన రావొచ్చు.

దీపా జయకుమార్ హంగామా

దీపా జయకుమార్ హంగామా

ఓ వైపు జయలలిత సోదరుడి కూతురు దీపా కుమార్, మరో నాయకురాలు శశికళ పుష్పలు .. శశికళకు వ్యతిరేకంగా ఉన్నారు. అయినప్పటికీ ఎక్కువ మంది శశికళ వైపు మొగ్గు చూపుతున్నారు.

చిక్కులు.. అప్పుడే డిఎంకే నుంచి ఒత్తిడి

చిక్కులు.. అప్పుడే డిఎంకే నుంచి ఒత్తిడి

ఓ వైపు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు శశికళ సిద్ధమవుతున్న సమయంలో.. పార్టీలో అనుమానాలు వ్యక్తం కావడం నుంచి మొదలు విపక్ష నేతలు కూడా అనుమానాలు లేవనెత్తడం గమనార్హం. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు శశికళ సిద్ధమవుతున్న నేపథ్యంలో డిఎంకే నేత స్టాలిన్ వ్యాఖ్యలు ఆమె పైన ఒత్తిడి కలిగించనున్నాయని అంటున్నారు. స్టాలిన్ ప్లాన్ ప్రకారమే.. వ్యూహాత్మకంగానే అనుమానాలు లేవనెత్తారని అంటున్నారు. శశికళ పైన ఒత్తిడి పెంచేందుకే కావొచ్చునని చెబుతున్నారు.

English summary
DMK leader Stalin doubts on Jayalalithaa's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X