సీఎం పళనిసామి ఫినిష్: హైకోర్టును ఆశ్రయించిన డీఎంకే
ప్రధాన ప్రతిపక్షం అయిన మా మనవిని స్పీకర్ పట్టించుకోలేదని, నియమాలు ఉల్లంఘించి అసెంబ్లీలో బలపరిక్ష జరిగిందని
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామిని పదవి నుంచి దించేయడానికి డీఎంకే పార్టీ న్యాయపోరాటం చెయ్యడానికి సిద్దం అయ్యింది. తమిళనాడులో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే తాము కచ్చితంగా అధికారంలోకి వస్తామని డీఎంకే పార్టీ అంటున్నది.
శనివారం తమిళనాడు సచివాలయంలో ఎడప్పాడి పళనిసామి బలపరిక్ష చట్టానికి వ్యతిరేకంగా జరిగిందని ఆరోపిస్తూ డీఎంకే పార్టీ సోమవారం మద్రాసు హై కోర్టును ఆశ్రయించింది. ఎడప్పాడి పళనిసామి ఎన్నిక రద్దు చెయ్యాలని మనవి చేస్తూ డీఎంకే పార్టీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది.

అంతే కాకుండ పోలీసులకు మార్షల్స్ దుస్తులు వేసి నియమాలకు విరద్దుంగా అసెంబ్లీలోకి రప్పించి మా మీద దాడి చేయించారని డీఎంకే పార్టీ హై కోర్టును ఆశ్రయించింది. ప్రధాన ప్రతిపక్షం అయిన మా మనవిని స్పీకర్ ధనపాల్ పట్టించుకోలేదని డీఎంకే పార్టీ ఆరోపించింది.
నియమాలు ఉల్లంఘించి సీఎంగా పళనిసామి బలపరిక్షలో నెగ్టారని, రహస్య ఓటింగ్ కు స్పీకర్ అనుమతి ఇవ్వలేదని ఆరోపిస్తూ డీఎంకే పార్టీ హై కోర్టును ఆశ్రయించింది. డీఎంకే పార్టీ వేసిన పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది.












Click it and Unblock the Notifications