వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర, మా ఎమ్మెల్యేలతో స్టాలిన్ బేరసారాలు'

తమిళనాడు రాష్ట్రంలోని పళని స్వామి నేతృత్వంలోని అన్నాడిఎంకె ప్రభుత్వాన్ని కూల్చేందుకుగాను డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కుట్ర చేస్తున్నారని అన్నాడిఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవి దినకరన్ ఆరో

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:తమిళనాడు రాష్ట్రంలోని పళని స్వామి నేతృత్వంలోని అన్నాడిఎంకె ప్రభుత్వాన్ని కూల్చేందుకుగాను డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కుట్ర చేస్తున్నారని అన్నాడిఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవి దినకరన్ ఆరోపించారు.

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో స్టాలిన్ బేరాలు సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కొందరు ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు.

ttv dinakaran

అన్నాడిఎంకె పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన సిఎం పళని స్వామి, ప్రిసీడియం ఛైర్మెన్ సెంగుట్టయన్, మంత్రులు, ఎమ్మెల్యేలతో దినకరన్ సమావేశమయ్యారు.

గంటపాటు ఈ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలను మాత్రమే పిలిపించారు.ఈ సమావేశం అనంతరం చేసిన వ్యాఖ్యలు సంచలనానికి కారణమయ్యాయి.

డిఎంకె అధినేత స్టాలిన్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు చేస్తున్నారనే ఆరోపణలు చేశారు. పన్నీర్ సెల్వానికి మద్దతుగా స్టాలిన్ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు.

పన్నీర్ సెల్వం శిభిరంలో చేరాలని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై స్టాలిన్ ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు.పన్నీర్ సెల్వం వర్గంలోకి చేరే ఎమ్మెల్యేలకు అన్ని సమకూర్చేందుకుగాను స్టాలిన్ సిద్దంగా ఉన్నారని చెప్పారు.

15 మంది ఎమ్మెల్యేలను డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ప్రలోభాలకు గురిచేశారని ఆయన చెప్పారు.ఎవరెన్ని కుట్రలు చేసినా ఆర్ కె నగర్ ఉపఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

తప్పుడు ఆరోపణలంటూ స్టాలిన్ ఖండన

అన్నాడిఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవి దినకరన్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమేనని డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ చెప్పారు.ప్రచారం కోసమే దినకరన్ ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారని స్టాలిన్ చెప్పారు. అర్హత లేని వారు చేసిన వ్యాఖ్యలను పరిగణించాల్సిన అవసరం లేదన్నారాయన.

English summary
AIADMK Deputy General Secretary T T V Dinakaran on Saturday alleged that DMK leader M K Stalin was trying to topple his party-led government. Stalin, however, dismissed the allegation as done with an intention to garner publicity by the AIADMK leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X