• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆరోగ్యమే మహాభాగ్యం: కులాంతర వివాహాలు ఆరోగ్యానికి మంచివి..డీఎన్ఏ పరీక్షలో వెల్లడి

|

ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త విషయాల్లో ఎక్కువ ఆసక్తిగా మారింది జన్యుశాస్త్రం. జన్యుశాస్త్రం గురించి ఏ కొత్త అంశం శాస్త్రవేత్తలు కనుగొన్నా చాలామంది ఆ విషయం తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది ఇతర దేశాల్లోనే కాదు భారత దేశంలో కూడా జన్యుశాస్త్రానికి ప్రాముఖ్యత ఏర్పడింది. "మనం ఎవరం ఎక్కడి నుంచి వచ్చాం " ఇంగ్లీషులో "Who We Are and How We Got Here" అనే టైటిల్‌తో హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ రిచ్ ఓ పుస్తకం రాశారు. ఇందులో డీఎన్ఏ నుంచి మానవుని మూలాలను ఈ పుస్తకంలో ఆయన వివరించారు. కులాంతర వివాహాలు ఆరోగ్యానికి మంచివని పరిశోధనల్లో వెల్లడైనట్లు రిచ్ తెలిపారు.

 వారసత్వం పరంగా రెండుగా విభజించబడ్డ భారత ప్రజలు

వారసత్వం పరంగా రెండుగా విభజించబడ్డ భారత ప్రజలు

భారత్‌లో కొంతమంది శాస్త్రవేత్తలు మానవుని మూలాలపై చేసిన కృషి ప్రశంసనీయం అన్నారు. భారత్‌లో ప్రజలు వారసత్వపరంగా రెండుగా విభజించబడ్డారని చెప్పుకొచ్చారు. వారు ఉత్తర భారతీయులు, దక్షిణ భారతీయులు. ఉత్తర భారతీయుల్లో కులం అనేది అగ్రవర్ణాల్లో ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలిపారు. మరికొన్ని పరిశోధనల్లో అండమాన్ నికోబార్ దీవులకు చెందిన ప్రజలు, టిబెట్ బర్మాలకు చెందిన మనుషులు, ఆస్ట్రోఆసియా తెగకు చెందిన మనుషులు భారత జనాభాలో కలిసిపోయినట్లు తెలిసిందన్నారు. అయితే అతిపెద్ద మిస్టరీ ఏమిటంటే ...హరప్పా సంస్కృతికి చెందినవారు ఎవరో ఇప్పుడు ఏమైపోయారో అనేది డీఎన్ఏ ఒక్కటే తేల్చగలదని చెబుతున్నారు డేవిడ్ రిచ్. 4500 ఏళ్ల క్రితం నాటి అస్తిపజరం ఒకటి రఖిగరి ప్రాంతంలో దొరికిందని దానిపై డీఎన్ఏ పరీక్షలు చేయగా అందులోని జన్యువులు ఉత్తరభారతంకు చెందిన వ్యక్తిదిగా బయటపడిందన్నారు. ఇలా భవిష్యత్తులో పురావస్తు శాస్త్రం, జన్యుశాస్త్రం కలిపి మరిని ఆసక్తికర విషయాలను వెల్లడిస్తాయని చెప్పారు.

డీఎన్ఏ ఏం చెబుతోంది..?

డీఎన్ఏ ఏం చెబుతోంది..?

4వేల ఏళ్ల క్రితం ఉత్తరభారతీయులు దక్షిణ భారతీయులను వివాహం చేసుకునేవారు కాదు. ఆ తర్వాత మరో 2వేల ఏళ్లకు అప్పుడప్పుడే ఉత్తరాది వారు దక్షిణాది వారిని పెళ్లిచేసుకోవడం మొదలు పెట్టారు. దీంతో ఉత్తరాది వారు దక్షిణాది వారు కలిసిపోయినట్లయ్యింది. ఆ తర్వాత 70 తరాల క్రితం, మన పూర్వీకులు ఉత్తరాది వారిని వివాహం చేసుకోవడం మానేశారు. ఆ తర్వాత అంతర్వివాహికుల సమూహం ఏర్పాటు చేశారు. దాన్నే కులం అని నేడు పలుకుతున్నామన్నారు. ఇక అప్పటినుంచి అంటే 2వేల ఏళ్ల క్రితం నుంచే అదే సామాజిక వర్గానికి చెందిన వారిని భారతీయులు వివాహం చేసుకుంటూ వచ్చారని రిచ్ వివరించారు. హరప్పన్లు ఎవరు అనేది చదువుకునేందుకు రాజకీయ ఆసక్తికోసం బాగానే ఉన్నా... కులం అనేది కీలకంగా మారి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని భావించారు.

కులాంతర వివాహాలతో జన్యుపరమైన సమస్యలు

కులాంతర వివాహాలతో జన్యుపరమైన సమస్యలు

భారత్‌ పెద్ద సంఖ్యలో చిన్న జనాభా సమూహం కలిగిన దేశం. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు గ్రామాల్లో పక్క పక్కనే నివసిస్తారు. ఇలా వందేళ్లకు పైగా నివసించారు. యూరప్‌ దేశాల్లో నివసిస్తున్న ప్రజల జన్యువులతో పోలిస్తే భారత్‌లో జీవనం సాగిస్తున్న వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజల జన్యువులు మూడురెట్లు వేరుగా ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైందని రిచ్ వివరించారు. 263 కులాలకు చెందిన మనుషులపై పరిశోధనలు చేయగా అందులో 81 తమ సంతతికి చెందిన వారే అని గుర్తించడం జరిగింది. 14 సామాజిక వర్గాల జనాభా మిలియన్లలో ఉంది. వీరిలో చాలావరకు జన్యుపరమైన సమస్యలు తలెత్తాయి. ఇందుకు కారణం వారు తమ బంధువర్గంలోని వారినే వివాహం చేసుకోవడమే అని గుర్తించారు. వేరే ప్రాంతం వారైనప్పటికీ తమ పూర్వీకులు ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి సంబంధాలు కలుపుకుని పెళ్లి చేసుకుంటున్నారని రిచ్ తెలిపారు.

 జన్యుపరీక్షతో జాగ్రత్త పడొచ్చు

జన్యుపరీక్షతో జాగ్రత్త పడొచ్చు

ఒక వ్యక్తి వివాహం చేసుకునే సమయంలో చిన్న జన్యుపరమైన పరీక్ష చేయిస్తే అందుకు సంబంధించిన జబ్బులు బయటపడే అవకాశం ఉందని వివరించారు. భారత్‌లో 5వేల కులాల వరకు ఉన్నాయన్న రిచ్... ఒక్కో కులంలో ఉన్న జన్యుపరమైన వ్యాధుల జాబితాను తయారు చేయాలని చెప్పారు. ఇలా చేయాలంటే ప్రతి సామాజిక వర్గం నుంచి 200 మనుషుల జన్యువులను పరీక్షించాలని వెల్లడించారు. ఇలా జాతీయ జన్యు వివరాలకు సంబంధించిన సమాచారం ఉంటే ఒక చిన్న పరీక్ష ద్వారా ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరో సామాజిక వర్గానికి చెందిన మహిళను వివాహం చేసుకుంటే పుట్టబోయే పిల్లల్లో ఎలాంటి జన్యుపరమైప జబ్బులు వస్తాయో లేక అంతా బాగానే ఉంటుందో ఇట్టే చెప్పేయొచ్చని వివరించారు రిచ్. కుల వివక్షను పారద్రోలాలంటే ప్రజాఆరోగ్యం కీలకంగా వ్యవహరిస్తుందన్నారు.

 కులాంతర వివాహాలు చాలా మంచివి

కులాంతర వివాహాలు చాలా మంచివి

మొత్తానికి తమ పరిశోధనల ద్వారా తేలింది ఏమిటంటే కులాంతర వివాహాలు ఇటు వ్యక్తిగతంగా అటు సమాజానికి చాలా మేలు చేస్తాయని రిచ్ చెప్పారు. 2వేల ఏళ్ల క్రితమే కులాంతర వివాహాలు జరిగాయని అంటే ఉత్తర భారతీయులు దక్షిణ భారతీయులను వివాహం చేసుకున్నారని ఆ తర్వతనే కులం అనేది సమాజంలో నాటుకుపోయి మనుషులను వేరు చేసిందని చెప్పారు. భారత దేశంలో 5 నుంచి 6శాతం మాత్రమే కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్. 42వేల గృహాల్లో భారత మానవాభివృద్ధి సంస్థ సర్వే చేయగా 2004-05, 2011-12లో కులాంతర వివాహాల సంఖ్యలో మార్పులేదని తేలింది. మిజోరాం, మేఘాలయా, సిక్కిం, జమ్ముకశ్మీర్, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఎక్కువగా కులాంతర వివాహాలు జరిగినట్లు సర్వే తెలిపిందని చెప్పారు రిచ్. మరోవైపు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, గోవా, పంజాబ్‌ రాష్ట్రాల్లో తక్కువగా కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. దక్షిణ భారత రాష్ట్రాల్లోనే కులాంతర వివాహాలు ఎక్కువగా జరిగాయని మరో సర్వే పేర్కొంది. తమిళనాడులో కులాంతర వివాహాల శాతం కేవలం 3శాతంగానే ఉన్నట్ల సర్వే వెల్లడించింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Among the most exciting discoveries in recent years has been in the field of genetics and genomics, as the deciphering of the Indian genetic code has yielded fascinating insights into, “Who We Are and How We Got Here”. That’s the title of Harvard scientist David Reich’s recent book on human origins as pieced together from our DNA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more