వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుచిత్రా సేన్ చిత్రం: నాడు ఇందిర గాంధీ భయపడ్డారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అలనాటి నటి సుచిత్రా సేన్ శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కోల్‌కతాలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సచిత్రా తుది శ్వాస విడిశారు. ఆమె మృతి పట్ల యావద్దేశం సంతాపం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలియజేశారు.

కాగా, సుచిత్రా సేన్ ఆంధీ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల సమయంలో నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఒకింత భయాందోళనకు గురయ్యారట. గుల్జార్ దర్శకత్వంలో సుచిత్రా సేన్ నటించిన ఆంధీ చిత్రం 1975లో విడుదలయింది. ఈ చిత్రం భారత రాజకీయలపై తీశారు.

Do You Know? Indira Gandhi was scared of Suchitra Sen's movie 'Aandhi'

ఈ చిత్రం నాటి ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తీసినట్లుగా అప్పుడు చాలామంది భావించారు. ఈ చిత్రం యొక్క పలు ప్రచార పోస్టర్లలో కూడా 'మీ ప్రధానమంత్రి నిజ జీవితంపై వచ్చిన చిత్రం చూడండి' అని పేర్కొన్నారట. విడుదలకు ముందు అలా ప్రచారం జరగడంతో ఇందిరా గాంధీ ఒకింత భయాందోళనకు గురయ్యారట.

1975లో ఇందిర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ చిత్రాన్ని 'యథాతథంగా' విడుదల చేసేందుకు అడ్డంకులు కూడా ఏర్పడ్డాయట. ఎమర్జెన్సీ సమయంలో ఈ చిత్రాన్ని బ్యాన్ కూడా చేశారు.

ఆ చిత్రాన్ని చూసిన తర్వాత బ్యాన్ ఎత్తివేసే విషయమై ఆలోచించాలని నాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ పిఎంవోను ఆదేశించారట కూడా. 1977లో జనతా ప్రభుత్వం వచ్చాక 'యథాతథంగా' చిత్రాన్ని నేషనల్ టెలివిజన్‌లో వేసేందుకు అనుమతించారట.

English summary

 Veteran actress Suchitra Sen passed away at a hospital in Kolkata on Friday, Jan 17. Entire country, especially West Bengal have been mourning on the demise of the actress. But do you know that the then prime minister of the country -- Indira Gandhi was scared of Suchitra Sen's super hit movie -- Aandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X