ఆపరేషన్ చేస్తూ మహిళ వీడియో తీసిన డాక్టర్, అసభ్యంగా కామెంట్లు
ఆపరేషన్ కోసం వచ్చిన మహిళను అసభ్యకరమైన మాటలతో వేధించడమే కాదు, ఆమెకు ఆపరేషన్ చేసే సమయంలో బాధితురాలికి తెలియకుండానే వీడియోను తీసి తన స్నేహితుడైన మరో డాక్టర్ కు పంపాడు ఓ డాక్టర్.
థానే: ఆపరేషన్ కోసం వచ్చిన మహిళను అసభ్యకరమైన మాటలతో వేధించడమే కాదు, ఆమెకు ఆపరేషన్ చేసే సమయంలో బాధితురాలికి తెలియకుండానే వీడియోను తీసి తన స్నేహితుడైన మరో డాక్టర్ కు పంపాడు ఓ డాక్టర్. ఈ విషయం తెలిసిన బాధితురాలు డాక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహరాష్ట్రలోని భీవండి పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఈ నెల 12వ, తేదిన ఓ మహిళ శస్త్రచికిత్స చేయించుకొంది.ఈ ఆపరేషన్ సమయంలో బాధితురాలికి తెలియకుండానే వైద్యుడు ఆపరేషన్ సమయంలో ఆమెను వీడియో తీశాడు.

అంతేకాదు ఆపరేషన్ సమయంలోనే ఆమె పట్ల వైద్యుడు అసభ్యంగా మాట్లాడారు. అంతేకాదు ఆమెను తీవ్ర మనోవేదనకు గురి చేశారు. అయితే ఆమెకు తెలియకుండానే ఆమె వీడియో తీసిన డాక్టర్ ఆ వీడియోను తన స్నేహితుడైన మరో డాక్టర్ కు పంపాడు.
ఈ వీడియోను ఆ డాక్టర్ కూడ తన స్నేహితుడికి పంపాడు.అంతేకాదు ఈ వీడియోకు సంబంధించి కామెంట్లు పెట్టాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు డాక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరు డాక్టర్లతో పాటు మరో వ్యక్తిపై కూడ కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications