వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కూటీపై కుక్క మూత్రం పోసిందని కాల్పులు, నలుగరికి తీవ్రగాయాలు

చిన్న విషయం చిలికి చిలికి గాలివానగా మారింది.కుక్క బైక్ పై మూత్రం పోసినందుకు ప్రారంభమైన గొడవ కాల్పులకు దారితీసింది.ఈ గొడవలో నలుగురు గాయపడ్డారు.ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది..

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో: చిన్న విషయం చిలికి చిలికి గాలివానగా మారింది.కుక్క బైక్ పై మూత్రం పోసినందుకు ప్రారంభమైన గొడవ కాల్పులకు దారితీసింది.ఈ గొడవలో నలుగురు గాయపడ్డారు.ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో చిన్న విషయానికి చేలరేగిన వివాదం కాల్పులకు దారితీసింది. పూరన్ లాల్ అనే వ్యక్తి బజరియా పట్టణంలో అన్నపూర్ణదేవి గుడికి వెళ్ళాడు.

Dog's nature call leads to shooting, four injured

అతడు తన స్కూటీని ఆలయం వెలుపల పార్కింగ్ చేశాడు. మున్నాయాదవ్ అనే వ్యక్తికి చెందిన రెండు పెంపుడు కుక్కలు అటు వైపుగా వెళ్తూ ఆ స్కూటీ మీద మూత్రం పోశాయి.

అయితే స్కూటీపై కుక్కలు మూత్రం పోయడంతో పూరన్ లాల్ మున్నాతో గొడవకు దిగాడు. ఇద్దరి మద్య వాదన తీవ్రమైంది. మున్నా కోపాన్ని ఆపుకోలేకపోయాడు. మున్నా , అతడి కొడుకు కలిసి కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో పూరన్ లాల్ అతడి కొడుకులు విజయ్ కుమార్, ముఖేష్ కుమార్ తో పాటు రాంకిషోర్ శర్మ అనే మరో వ్యక్తి కూడ గాయపడ్డారు. వాళ్ళందరినీ వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

ఆ నలుగురిలో ఒకరి పరిస్థితి విషమం ఉందని వైద్యులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే నిందితులు అక్కడి నుండి పారిపోయారు.

English summary
A dog's nature call at a wrong place in Uttar Pradesh's Bareilly district has resulted in a shootout that left four persons injured. One injured is reportedly critical.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X