వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాతో బాధపడుతూ వ్యాయామం చేస్తున్నారా ? అది చాలా డేంజర్ అంటున్న అధ్యయనం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మహమ్మారితో బాధపడుతున్నవారు కదలకుండా కూర్చుంటే ఇబ్బందని, ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరి అని, ఇప్పటివరకు వైద్యులు కరోనా బాధితులకు సూచించారు. ఇక దీంతో ప్రస్తుతం కరోనా బారినపడి ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ తొందరగా కోలుకోవడం కోసం తెగ వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఎలా పడితే అలా వ్యాయామాలు చేయడం అనర్థాలకు దారితీస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ఆందోళన కలిగించే వార్త.. కరోనా యాంటీ బాడీస్ 50రోజుల తర్వాత క్షీణిస్తాయని అధ్యయనంఆందోళన కలిగించే వార్త.. కరోనా యాంటీ బాడీస్ 50రోజుల తర్వాత క్షీణిస్తాయని అధ్యయనం

జామా కార్డియాలజీ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

జామా కార్డియాలజీ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వ్యాధుల బారి నుండి కాపాడుకోవడం కోసం, ఆరోగ్య రక్షణ కోసం వ్యాయామం తప్పనిసరి అనే ప్రచారం జోరుగా సాగుతుంది. కరోనా బారిన పడితే కావలసిన విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ ఉంటే కరోనా తగ్గిపోతుందని చాలా మంది భావిస్తున్నారు. అయితే అలా కరోనాతో బాధపడుతున్నవారు వ్యాయామం చేయడం మంచిది కాదని తాజా అధ్యయనంలో తేలింది.
జామా కార్డియాలజీ నిర్వహించిన ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి .

 కరోనా సమయంలో వ్యాయామంతో గుండె కండరాల సమస్యలు

కరోనా సమయంలో వ్యాయామంతో గుండె కండరాల సమస్యలు

కరోనాతో బాధపడుతున్నప్పుడు వ్యాయామం చేస్తే వ్యాధి లక్షణాలు మరింత తీవ్రతరం అవుతాయి అని, గుండె కండరాలు వాపు, మయోకార్డిటిస్ వంటి సమస్యలకు వ్యాయామం ఒక కారణమవుతుందని పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న 100 మంది మధ్య వయసున్న వారి పై నిర్వహించిన అధ్యయనంలో వారందరికీ కార్డియాక్ ఎమ్ఆర్ఐ పరీక్షలు చేశారు .ఇందులో సగం మందికి మితమైన మరియు తేలికపాటి లక్షణాలు కనిపించాయని, 18 శాతం మందికి లక్షణాలు లేవని పేర్కొన్నారు.

కరోనా బాధితుల్లో గుండెలో మార్పులు

కరోనా బాధితుల్లో గుండెలో మార్పులు

కరోనా సమయంలో గుండె సంబంధిత సమస్యలు లేని రోగులకు సైతం, అనారోగ్యంగా ఉన్న సమయంలో చేసిన వ్యాయామం వల్ల తరువాతి కాలంలో 78 శాతం మందికి గుండెలో నిర్మాణాత్మకమైన మార్పులు సంభవించాయని, 100 మందిలో 60 మందికి మయోకార్డిటిస్ సమస్య వచ్చిందని అధ్యయనంలో పేర్కొన్నారు. అధ్యయనం ప్రకారం కరోనా నిర్ధారణ అయిన వారు వ్యాయామం చేయడం వల్ల గుండెలో నిర్మాణాత్మక మార్పులు జరుగుతున్నాయని గుర్తించారు.

Recommended Video

#WATCH : పొట్టకూటి కోసం కర్రసాము.. బామ్మ కష్టం చూసి చలించిపోతున్న ప్రజలు! || Oneindia Telugu
అలసిపోయేంత వ్యాయామం మంచిది కాదని వెల్లడి

అలసిపోయేంత వ్యాయామం మంచిది కాదని వెల్లడి


కరోనా వైరస్ తీవ్రంగా మానవ శరీరంలో దాడి చేస్తున్నప్పుడు వ్యాయామం చేయడం వల్ల గుండెలో రక్త ప్రసరణతో పాటు కరోనా వైరస్ లోడు గుండెకు అధికమవుతుందని అంటున్నారు. దాంతో కరోనా వైరస్ గుండె కండరాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని అధ్యయనంలో వెల్లడించారు. కరోనాతో బాధపడుతున్న సమయంలో బాగా అలసిపోయేంత వ్యాయామాలు చేయడం మంచిది కాదని అధ్యయనం ద్వారా వెల్లడించారు. కేవలం తేలికపాటి వైద్యులు సూచించిన వ్యాయామాలను మాత్రమే చేయాలని చెప్తున్నారు.

English summary
A study conducted by Jama Cardiology found that exercise during corona can lead to heart muscle problems. Exercise is said to exacerbate the symptoms of the disease while exercising while suffering from corona, and exercise is said to be a cause for problems such as inflammation of the heart muscle and myocarditis. A study of 100 middle-aged people who recovered from the corona found that 60 had heart problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X