వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జీ అంటే ఏమిటో నాకు తెలియదు: కరుణానిధి భార్య

|
Google Oneindia TeluguNews

dayalu ammal
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధికి చెందిన నగరంలోని నివాసం సోమవారం తాత్కాలిక కోర్టుగా మారింది. 2జీ కుంభకోణం కేసు విషయంలో వాంగ్మూలాన్ని తీసుకునేందుకు న్యాయమూర్తి, సిబిఐ అధికారులు, ప్రాసిక్యూటర్స్, డిఫెన్స్ న్యాయవాది కరుణానిధి నివాసానికి చేరుకున్నారు. కరుణానిధి రెండో భార్య దయాలు అమ్మళ్‌ను వారు ప్రశ్నించారు.

సిబిఐ 2జీ విషయంలో ప్రశ్నించడంతో దయాలు అమ్మాళ్ తను గతం మరచిపోయినట్లు తెలియజేసేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. దీంతో ఆమెను సిబిఐ అధికారులు తమకు లభించిన ప్రతికూలత కలిగిన సాక్షిగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు గతం ఏమి జ్ఞాపకం రావడం లేదని దయాలు చెప్పినట్లు సమాచారం.

తనకు 2జీ లేదా సిబిఐ అంటే ఏమిటో తెలియదని దయాలు అమ్మాళ్ తెలిపినట్లు సమాచారం. తను గతంలో కూడా సిబిఐకి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వనట్లు ఆమె తెలిపారు. డిఎంకె పార్టీకి ప్రచార సాధనంగా ఉపయోగించే కలైంజర్ టివి గురించి కూడా తనకు ఏమి తెలియదని చెప్పినట్లు సమాచారం. కాగా కరుణానిధి కూతురు కనిమొళితోపాటు దయాలు అమ్మాళ్‌ కూడా ఆ టివి యజమానుల్లో ఒకరుగా ఉన్నారు.

2008లో టెలికాం శాఖ మంత్రిగా ఉన్న ఎ రాజా అర్హత లేని కంపెనీలకు అనుమతిలిచ్చిన కేసులో(2జీ) అతను జైలు పాలయ్యారు. అయితే ఆ సమయంలోనే రూ. 214 కోట్ల సొమ్మును రాజా నుంచి ఆ ఛానల్ స్వీకరించినట్లు సిబిఐ పేర్కొంటోంది. అయితే దయాలు అమ్మాళ్, కనిమొళి ఇద్దరూ కూడా ఆ ఛానల్ నిర్వహణలో పాలుపంచుకోవడం లేదని చెబుతున్నారు.

కాగా కేసుకు సంబంధముందన్న ఆరోపణలతో జైలు పాలైన కనిమొళి ఆరు నెలల తర్వాత నవంబర్ 2011న బెయిలుపై విడుదలయ్యారు. తనకు కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఏమి తెలియదని, చట్టబద్దం కాని ఎలాంటి కార్యకలాపాలకు తాను పాల్పడలేదని న్యాయమూర్తికి దయాలు అమ్మాళ్ చెప్పినట్లు తెలిసింది. తమ కుటుంబ సభ్యులకు కూడా కేసుతో ఎలాంటి సంబంధం లేదని అమ్మాళ్ చెప్పారు.

English summary
Former Chief Minister and DMK chief M Karunanidhi's home in Chennai became a makeshift courtroom today as the magistrate, CBI officers and prosecutors along with defence lawyers all landed up for the testimony of the politician's second wife, Dayalu Ammal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X