2జీ స్కాంపై మన్మోహన్ ఇలా, అలాగే చేయండి.. స్వీట్లు పంచిన స్టాలిన్
Recommended Video

న్యూఢిల్లీ: యూపీఏ 2 హయాంలో వెలుగు చూసిన 2జీ కుంభకోణంలో నిందితులందరినీ గురువారం పాటియాలా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా తీర్పు చెప్పింది. దీనిపై మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ స్పందించారు.
కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వంపై విష ప్రచారం జరిగిందని ఆయన వాపోయారు. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అది తాజాగా కోర్టు తీర్పుతో స్పష్టమయిందని తెలిపారు. దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదని, తీర్పు చెబుతుందన్నారు.

చారిత్రాత్మక తీర్పు
2జీ సుంభకోణం కేసులో కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక తీర్పు అని ఉత్సహంగా చెప్పారు. తీర్పు వెలువడగానే చెన్నైలోని స్టాలిన్, కనిమొళి నివాసాల ముందు కార్యకర్తలు బాణసంచా పేల్చారు. ఢిల్లీలోని పాటియాలా కోర్టు వెలుపల కూడా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

మిఠాయిలు పంచిన స్టాలిన్
స్టాలిన్ స్పందన కోసం ఆయన ఇంటికి చేరుకున్న మీడియా సిబ్బందికి స్టాలిన్ స్వయంగా స్వీట్లు పంచి పెట్టారు. తీర్పు డీఎంకేను నాశనం చేసేందుకు కేసు పెట్టారని, పార్టీ ఎలాంటి తప్పు చేయలేదని కోర్టు తీర్పుతో తేటతెల్లమయిందని వెల్లడించారు.

అంతే ఉత్సాహంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి
అన్ని కుంభకోణాల విషయంలో మీడియా ఎంత ఉత్సాహంగా పని చేసిందో అంతే ఉత్సాహంగా కోర్టు ఇచ్చిన తాజా తీర్పును కూడా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించింది.

వినోద్ రాయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
పాటియాలా కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కాగ్ మాజీ వినోద్ రాయ్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఆయన జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత మనీష్ తివారి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా ఆయనపై విరుచుకుపడుతున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications