మోడీని నిండా ముంచేస్తున్న ట్రంప్ ? రోజుకో సంచలనం..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ ను చేపట్టి విజయవంతమైన భారత సైన్యం ఆ తర్వాత పాకిస్తాన్ అమెరికాను ఆశ్రయించడంతో కాల్పుల విరమణ రూపంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీనిపై దేశంలో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అమెరికా మాట విని మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పై దాడి చేయకుండా వెనక్కి తగ్గడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి ప్రధాని మోడీ వద్ద సమాధానం లేకుండా పోతోంది. అయితే ఈ పరిణామాల వెనుక ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు భారత్ కు తలనొప్పిగా మారుతున్నారు.
పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉధృతంగా కొనసాగుతోంది. ఇందులో పాకిస్తాన్ కనీవినీ ఎరుగని నష్టాలు చవి చూస్తోంది. మరో రెండు, మూడు రోజులు ఇదే పరిస్ధితి కొనసాగితే పాకిస్తాన్ ఇక కోలుకోవడం కూడా కష్టమేనన్న వాదన వినిపించింది. అలాగే భారత్ మరోసారి పాకిస్తాన్ ను మట్టి కరిపించి ఉగ్రవాదులకు కూడా తగిన జవాబు ఇచ్చినట్లవుతుందన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా డొనాల్ట్ ట్రంప్ భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా భారత దేశం విదేశాంగ విధానం విషయంలో తీసుకున్న ఓ కీలక నిర్ణయం తాను కాకుండా మూడో పక్షం అయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాల్సి రావడం పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ముఖ్యంగా పాకిస్తాన్ పై ఉరుముతున్నట్లు కనిపించిన ప్రధాని మోడీ.. దేశ ప్రజలకు చెప్పకుండా పాకిస్తాన్ తో కాల్పుల విరమణకు ట్రంప్ కు అంగీకారం తెలపడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ కు ఇలాంటి విషయాలు కొత్తేమీ కాకపోయినా భారత్ కు మాత్రం ఇదే తొలిసారి.
దీంతో భారత విదేశాంగవిధానం ఇంత బలహీనంగా ఉందా అన్న చర్చ సాగుతోంది.
पहलगाम आतंकी हमले के बाद कांग्रेस पार्टी ने शुरुआत से ही सरकार का साथ दिया। हमने कहा कि हम सरकार और सेना के साथ पूरी एकजुटता से खड़े हैं, चाहे वे कोई भी कदम उठाएं। हमने 'ऑपरेशन सिंदूर' का पूरा समर्थन किया था।
— Congress (@INCIndia) May 13, 2025
लेकिन प्रधानमंत्री मोदी के संबोधन से पहले ही राष्ट्रपति ट्रंप ने घोषणा… pic.twitter.com/QrJcvb3WEu
పాకిస్తాన్ తో కాల్పుల విరమణను తమకు సంబంధం లేకుండా ట్రంప్ ప్రకటించడంతో నివ్వెరపోయిన భారత్.. అనంతరం కోలుకుని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో ప్రకటన చేయించింది. అయితే ఇంతటితో వివాదం ముగిసిందని భావిస్తున్న తరుణంలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీంతో భారత్ మరింత ఇరుకునపడింది. వరుసగా తగిలిన ఈ రెండు ఎదురుదెబ్బలతో భారత ప్రధాని మోడీ సైతం ఆత్మరక్షణలో పడిపోయారు. చివరికి పాక్ వెనక్కి తగ్గింది.
అయితే ఇంతటితో వివాదం ముగిసిందని భావిస్తున్న సమయంలో నిన్న ట్రంప్ మరోసారి భారత్-పాక్ అణుయుద్ధం ఆపానంటూ, లక్షల ప్రాణాలు కాపాడానంటూ ప్రకటించారు. అంతే కాదు మీరిద్దరూ యుద్ధం ఆపకుంటే మీతో వాణిజ్యం ఉండబోదంటూ భారత్, పాక్ కు చేసిన హెచ్చరిక సైతం మోడీకి ఇబ్బందికరంగా మారింది. భారత్, పాక్ యుద్దానికీ, అమెరికాతో వాణిజ్యానికి సంబంధం ఏంటని కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీని ప్రశ్నిస్తోంది. దీనికీ ఆయన వద్ద సమాధానం లేకుండా పోయింది. అసలు భారత ప్రభుత్వం మన చేతుల్లో ఉందా లేక అమెరికా చేతుల్లో ఉందా అనేట్లుగా ట్రంప్ రెచ్చిపోతున్నారు. ఇది అంతిమంగా మోడీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారేలా ఉంది.












Click it and Unblock the Notifications