Donald Trump: ఉగ్రవాదంపై ఉక్కుపాదం, భారత్‌తోపాటు పాకిస్థాన్‌తో కలిసి పనిచేస్తాం: ట్రంప్

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ స్పష్టంచేశారు. అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో 'నమస్తే ట్రంప్' సభలో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామని ట్రంప్ చేశారు. ఏ రూపంలో ఉగ్రవాదాన్ని సహించబోమని తేల్చిచెప్పారు. ప్రజలను ఉగ్రవాద ముప్పు నుంచి కాపాడేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామని ట్రంప్ పేర్కొన్నారు.

ప్రపంచాన్ని వణికిస్తోన్న ఐఎస్ ఉగ్రవాదులను అమెరికా సైనికులు కూకటివేళ్లతో పెకిలిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఉగ్రవాదులను మట్టుబెట్టారని స్పష్టంచేశారు. దాదాపు 100 శాతం ఉగ్రవాదులను నిర్మూలించామని ట్రంప్ తెలిపారు. అల్ బాగ్దాదిని కూడా అమెరికా సైనికులు మట్టుబెట్టారని ట్రంప్ వివరించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతీ ఒక్క దేశంతో కలిసి పనిచేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఇండియాతోపాటు పాకిస్థాన్‌తో కూడా కలిసి పనిచేస్తామని పేర్కొనడం చర్చకు దారితీసింది.

Donald Trump: India, US together against radical Islamic terror

సరిహద్దుల్లో ఉగ్రవాద సమస్యకు సంబంధించి పాకిస్థాన్‌తో కలిసి పనిచేస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ వివరించారు. పాకిస్థాన్‌తో అమెరికాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ట్రంప్ వివరించారు. ఆ చనువుతో సరిహద్దుల్లో ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేశామని పేర్కొన్నారు. వాస్తవానికి ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచి పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇచ్చి భారతదేశంపై దాడులకు తెగబడుతోన్న ఘటనలు ఉన్నాయి. అయితే ట్రంప్ మాత్రం ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు భారత్‌తోపాటు పాకిస్థాన్‌ కూడా కలిసి పనిచేస్తామని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+