వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు పావుగా మారొద్దు, మోడీ చేతిలో ట్విట్టర్ ఇండియా కీలుబొమ్మ..?, సీఈవో పరాగ్‌కు రాహుల్ లేఖ

|
Google Oneindia TeluguNews

మాటలతో, మాయతో భారతదేశ ఆలోచనలు, విధానాలను విధ్వంసం చేయడంలో పావుగా మారొద్దు అని సీనియర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు లేఖ రాశారు. గత 27వ తేదీన రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూజర్లు స్వేచ్చ, ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ట్విట్టర్ ఇండియా అధికారులు కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా నడుచుకుంటున్నారని కామెంట్ చేశారు. అంతేకాదు ఇదివరకు తన ఖాతాను స్తంభింపజేసిన విధానాన్ని కూడా గుర్తుచేశారు.

తన ఫాలొవర్ల గురించి కూడా రాహుల్ గాంధీ మెన్షన్ చేశారు. 2021లో తొలి 7 నెలలు తన ఫాలొవర్లు 4 లక్షల మంది ఉండేవారని గుర్తుచేశారు. కానీ ఆగస్టులో తన ఖాతాను స్తంభింపజేయడంతో అదీ మందగించిందని తెలిపారు. ఆ సమయంలోనే తాను కీలకమైన అంశాలను ట్విట్టర్ వేదికగా లేవనెత్తానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 100 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా తాను సమస్యలను రాశానని పేర్కొన్నారు. కానీ దానిని కొందరి ప్రయోజనం కోసం వాడుకున్నారని ఆరోపించారు. లైంగికదాడికి గురయిన కుటుంబం గురించి, రైతులకు మద్దతు తెలియజేస్తూ.. ఇతర కీలక అంశాలను ప్రస్తావించానని రాహుల్ గాంధీ తెలిపారు.

Dont be a pawn in the destruction of the idea of India: Rahul Gandhi

Recommended Video

UP Elections 2022 : Congress Promises 20 lakh Jobs | Congress Youth Manifesto | Oneindia Telugu

వివాదాస్పద రైతు చట్టాలను రద్దు చేయాలని తాను పోస్ట్ చేసిన వీడియోకు జనం నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. ప్రజల సమస్యలను, సాధక బాధకాలను ట్విట్టర్ వేదికగా ప్రస్తావించానని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ట్విట్టర్ ఇండియాపై పనిచేసిందని వివరించారు. తన గొంతు నొక్కారని.. తన ఖాతాను కొద్దీరోజులు నిలిపివేశారని తెలిపారు. అంతేకాదు మిగతావారి ఖాతాలను మాత్రం స్తంభింపజేయలేదు అని చెప్పారు. తననే లక్ష్యంగా చేసుకున్నారని రాహుల్ గాంధీ వివరించారు.

English summary
Senior Congress leader Rahul Gandhi has written to Twitter, urging it not to become “a pawn in the destruction of the idea of India”. Writing to Twitter CEO Parag Agarwal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X