24 రోజుల్లో మీ సొమ్ము రెట్టింపు- 5 లక్షల మందిని రూ.150 కోట్లు ముంచిన చైనా యాప్‌లు

భారత్‌లో చైనా యాప్‌ల మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దురాశాపరుల బలహీనతను సొమ్ముచేసుకుంటూ చైనాకు చెందిన పలు యాప్‌లు దాదాపు 5 లక్షల మందిని నిండా ముంచినట్లు ఢిల్లీ పోలీసులు తాజాగా గుర్తించారు. రూ.150 కోట్ల మేర జరిగిన ఈ స్కాంను ఢిల్లీ పోలీసులు బయటపెట్టారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. 24 రోజుల్లోనే రెట్టింపు పెట్టుబడి వస్తుందన్న ఆశ చూపి కోట్లాది రూపాయలను భారతీయుల నుంచి ఈ యాప్‌లు కాజేశాయి.

 భారత్‌లో చైనా యాప్‌ల మోసాలు

భారత్‌లో చైనా యాప్‌ల మోసాలు


భారత్‌లో చాలా వరకూ చైనా యాప్‌లను గతేడాది సరిహద్దు ఘర్షణల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయినా ఇంకా చైనా యాప్‌ల మోసాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భారతీయుల బలహీనతల్ని అడ్డుపెట్టుకుని రెట్టింపు డబ్పులిస్తామంటూ చైనా యాప్‌లు పెట్టుబడుల్ని ఆకర్షించాయి. దీంతో లక్షలాది మంది భారతీయులు వీటిలోకి దూరి పెట్టుబడులు పెట్టారు. భారీగా డబ్బులు తిరిగొస్తాయనే ఆశతో పెట్టిన డబ్బులన్నీ పోయాయని తేలిపోవడంతో లబోదిబోమంటున్నారు.

రూ.150 కోట్లు మోసపోయిన 5 లక్షల మంది

రూ.150 కోట్లు మోసపోయిన 5 లక్షల మంది

దాదాపు 5 లక్షల మంది భారతీయుల్ని చైనాకు చెందిన యాప్‌లు రూ.150 కోట్ల మేర పెట్టుబడులు పెట్టించి ముంచేసినట్లు ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీమ్‌ల పేరుతో ఈ మొత్తాన్ని అవి స్వాహా చేసినట్లు తేల్చారు. దీంతో ఇప్పుడు ఆ 5 లక్షల మంది తమ డబ్బులు తమకు ఇప్పించాలని కోరుతున్నారు. ఈ మొత్తంలో పలు బ్యాంక్‌ ఖాతాల్ని బ్లాక్ చేయడం ద్వారా రూ.11 కోట్లను కాపాడగలిగారు. అలాగే పేమెంట్ గేట్‌వేలను నిలువరించడం ద్వారా మరో రూ.97 లక్షలు స్వాహా కాకుండా రక్షించారు.

 110 ఫేక్‌ కంపెనీలతో మోసం

110 ఫేక్‌ కంపెనీలతో మోసం

గుర్గావ్‌కు చెందిన ఓ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ సాయంతో చైనా యాప్‌లు ఈ రూ.150 కోట్ల మోసానికి తెరలేపాయి. సీఏ ద్వారా మొత్తం 110 ఫేక్‌ కంపెనీలను అవి సృష్టించినట్లు ఢిల్లీ పోలీసులు తేల్చారు. వీటి సాయంతోనే లావాదేవీలన్నీ జరిగినట్లు తెలిసింది. ఇవన్నీ సదరు యాప్ వినియోగదారుల నుంచి డబ్బును స్వాహా చేయడమే కాకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని కూడా దోచుకున్నాయి. దీంతో ఇప్పుడు ఈ భారీ మనీలాండరింగ్‌ స్కామ్‌ ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

24 రోజుల్లో రెట్టింపు పేరుతో మోసం

24 రోజుల్లో రెట్టింపు పేరుతో మోసం


ఈ మోసానికి పాల్పడిన చైనా యాప్‌లు ఏయే మార్గాల్లో నిధులు సేకరించాయన్నది ఢిల్లీ పోలీసులు స్పష్టంగా నిర్ధారణకు వచ్చారు. వారి దర్యాప్తు ప్రకారం కస్టమర్ల నుంచి తీసుకున్న డబ్బుల్ని 24 నుంచి 35 రోజుల్లో రెట్టింపు చేసి ఇస్తామంటూ నమ్మబలికాయి. దీంతో భారీ ఎత్తున జనం పెట్టుబడులు పెట్టేశారు. కొన్ని మొత్తాలైతే గంటల్లో, రోజుల్లో కూడా తిరిగిస్తామని ఆయా యాప్‌లు నమ్మబలికాయి. రూ. 300 నుంచి ప్రారంభమైన ఈ పెట్టుబడులు లక్షల్లో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ యాప్‌ల్లో ఒకటైన పవర్‌ బ్యాంక్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లో టాప్‌ 4లో ఉండటం మరో విశేషం. దీంతో పాటు ఈజీ ప్లాన్‌, సన్‌ ఫ్యాక్టరీ, ఈజీ కాయిన్, లైటింగ్‌ పవర్‌ బ్యాంక్‌ వంటి యాప్‌లు ఈ దోపిడీకి పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+