వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం: రెట్టింపు వేగంతో వైరస్ వ్యాప్తి -డబ్లింగ్‌ టైంలో భారీ తగ్గుదల -81%కేసులు 6 రాష్ట్రాలోనే

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా సాగుతున్నది. గతంలో కంటే వైరస్ ఇప్పుడు రెట్టింపు వేగంతో విస్తరిస్తున్నది. గడిచిన కొద్ది రోజులుగా కొత్త కేసుల ఉధృతి పెరగ్గా, కరోనా కేసుల రెట్టింపు కాలం(డబ్లింగ్‌ టైం) కూడా సగానికి పైగా తగ్గింది. అయితే కొత్త కేసుల తీవ్రత కేవలం ఆరు రాష్ట్రాల్లోనే అధికంగా ఉండటం గమనార్హం.

ఏపీ, తెలంగాణకు ఘోర అవమానం -హోదా లేదన్న కేంద్రంపై రామ్మోహన్ ఫైర్ -జతకలిసిన వైసీపీఏపీ, తెలంగాణకు ఘోర అవమానం -హోదా లేదన్న కేంద్రంపై రామ్మోహన్ ఫైర్ -జతకలిసిన వైసీపీ

కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన లెక్కల ప్రకారం కరోనా కేసుల డబ్లింగ్ టైమ్ లో భారీ తగ్గుదల కనిపించింది. మార్చి1వ తేదీ నాటికి 504.4 రోజులుగా ఉన్న డబ్లింగ్‌ సమయం మార్చి 23 నాటికి 202.3 రోజులకు తగ్గింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే డబ్లింగ్‌ రేటులో సగానికి సగం తగ్గడం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నది. కాగా,

 Doubling Time of Covid-19 Cases Decreases to 202.3 Days, 75% active cases in 3 states only

దేశవ్యాప్తంగా 40,715 కొత్త కేసులు బయటపడగా.. ఇందులో 80.90శాతం కేసులు కేవలం ఆరు రాష్ట్రాల్లోనే నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 24,645(60.53శాతం) కేసులుండగా, పంజాబ్‌లో 2,299, గుజరాత్‌లో 1,640 మందికి కొత్తగా వైరస్‌ సోకింది. మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, దిల్లీ, తమిళనాడు, చత్తీస్‌గఢ్‌, కర్ణాటక, హరియాణా, రాజస్థాన్‌లో రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపించగా, మరో 10 రాష్ట్రాల్లో కేసులు, మరణాలు తగ్గుతూ వచ్చాయి. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సోమవారం కరోనాతో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

న్యాయం దక్కట్లేదు -ఆ రెండే కారణాలు -డబ్బు లేకుండా చేయగలరా? -జస్టిస్ ఎన్వీ రమణ అనూహ్య వ్యాఖ్యలున్యాయం దక్కట్లేదు -ఆ రెండే కారణాలు -డబ్బు లేకుండా చేయగలరా? -జస్టిస్ ఎన్వీ రమణ అనూహ్య వ్యాఖ్యలు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3.45లక్షలల యాక్టివ్‌ కేసులుండగా.. ఇందులో 75.15శాతం కేవలం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఒక్క మహారాష్ట్రలోనే 62.71శాతం యాక్టివ్ కేసులున్నాయి. ఇక 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 199 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా మహారాష్ట్ర, పంజాబ్‌లో 58 మంది చొప్పున మరణించగా.. కేరళ, చత్తీస్‌గఢ్‌లో 12 మంది చొప్పున చనిపోయారు. ఇక, సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 32.53లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా 4.8కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

English summary
The doubling time of COVID-19 cases in India has decreased from 504.4 days on March 1 to 202.3 days on March 23, the Health Ministry said on Tuesday, highlighting that six states have reported a surge in daily new cases and together account for 80.90 per cent of the new infections reported in a day. Meanwhile, more than 32.53 lakh doses of COVID-19 vaccine were administered on March 22, which is the highest single-day vaccination so far, taking the total number of people inoculated to over 4.8 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X