Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విచారణ తర్వాతే అరెస్ట్: వరకట్న వేధింపుల కేసుల్లో సుప్రీం సంచలన తీర్పు

వరకట్న వేధింపులకు సంబంధించి ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు నిందితులను అరెస్టు చేయటం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అరెస్టులకు ముందు ఆ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణను జరపాలని.

న్యూఢిల్లీ: వరకట్న వేధింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

వరకట్న వేధింపులకు సంబంధించి ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు నిందితులను అరెస్టు చేయటం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అరెస్టులకు ముందు ఆ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణను జరపాలని, ఆ తర్వాతే చర్యకు ఉపక్రమించాలని స్పష్టం చేసింది.

భర్త, అతని తరఫు బంధువుల వేధింపుల నుంచి భార్యకు రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన చట్టం దుర్వినియోగం అవుతున్నందున ప్రతి జిల్లాలోనూ కుటుంబ సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

Dowry law: First examine complaint then arrest SC says in landmark verdict

వేధింపులపై ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ కమిటీలు పరిశీలించి నివేదిక సమర్పించిన తర్వాతే చర్యలు ఉండాలని స్పష్టం చేసింది. ఆ కమిటీల విధివిధానాలనూ న్యాయస్థానం నిర్దేశించింది.

రాజేశ్‌ శర్మ అనే వ్యక్తి అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఏకే గోయెల్‌, యుయు లలిత్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ తీర్పునిచ్చింది. వరకట్న హింస నిరోధక చట్టం దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఆ చట్టానికి తగిన సవరణలు చేయాలని కేంద్ర న్యాయశాఖను కోరింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+