అక్క పిలుస్తోందని ఆత్మహత్య, ఎక్కడంటే?
నాగ్‌పూర్: అక్క రోజూ కలలోకి వచ్చి తనను కూడ స్వర్గానికి రమ్మంటుందని ఓ యువతి ఆత్మహత్య చేసుకొన్న ఘటన మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకొంది.రెండు రోజుల క్రితం కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన యువతి బుధవారం నాడు ఆసుపత్రిలో మరణించింది.
మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన జ్యోతికి వివాహమైన ఇద్దరు పిల్లలు కూడ ఉన్నారు. జ్యోతి ఆమె చెల్లెలు ఆకాంక్షలు ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరిని విడిచి మరోకరు ఉండని పరిస్థితి.

గత ఏడాది కుటుంబ కలహలతో జ్యోతి ఆత్మహత్య చేసుకొంది. దీంతో జ్యోతి ఇద్దరు పిల్లలను జ్యోతి సోదరి ఆకాంక్ష చూసుకొంటుంది. అయితే జ్యోతి చనిపోయిన తర్వాత ఆమె గురించిన ఆలోచలనలతోనే ఆకాంక్ష గడిపేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
అయితే ప్రతిరోజూ జ్యోతి తన కలలోకి వస్తోందని ఆకాంక్ష చెబుతుండేదని వారు గుర్తు చేసుకొన్నారు. జ్యోతి తనను కూడ స్వర్గానికి రమ్మని పిలుస్తోందని ఆకాంక్ష అప్పుడప్పుడూ చెప్పేదంటున్నారు.
ఇదే కారణంగా రెండు రోజుల క్రితం ఆకాంక్ష కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రెండు రోజులుగా ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ బుధవారం నాడు ఆమె మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications