Gold: సినీ ఫక్కీలో ఛేజ్.. 3 గంటల తర్వాత చిక్కిన స్మగ్లర్లు..
పాన్-ఇండియా ఆపరేషన్‌లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బంగారం స్మగ్లర్లను పట్టుకుంది. సినిమా ఫక్కీలో స్మగ్లర్లను అధికారులు పట్టుకున్నారు. అడవుల్లో వంకల తిరిగిన రోడ్ల మధ్య వెంబడిస్తూ నాటకీయంగా మూడు గంటల పాటు ఛేజింగ్ చేసి మరి స్మగ్లర్లను పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ. 19 విలువ చేసే 31.7 కిలోల బరువున్న భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అక్టోబర్ 13-14 తేదీల్లో వారణాసి, నాగ్‌పూర్, ముంబయిలో చాలా ఖచ్చితమైన ప్రణాళికతో పరేషన్ నిర్వహించి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా నుంచి బయలుదేరిన రైలులో నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో దిగినప్పుడు నాగ్‌పూర్ బృందం రెండు బంగారు క్యారియర్‌లను పట్టుకుంది. వారి నుంచి 8.5 కిలోల విదేశీ మార్క్ బంగారం స్వాధీనం చేసుకున్నారు. వారి విచారించగా.. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నుంచి బంగారం స్మగ్లింగ్ అవుతుందని చెప్పారు.

దీంతో అధికారులు స్మగ్లర్లు కారులో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. 3 గంటల పాటు స్మగ్లర్ల కారును వెంబడించి చివరికి పట్టుకున్నరారు. కారు హ్యాండ్ బ్రేక్ కింద ఉన్న రంధ్రంలో బంగారాన్ని 18 కిలోలు బంగారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా భారతదేశంలోకి తీసుకువచ్చిన బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేవారు. యూపీ పోలీసుల సాయంతో డీఆర్ఐ బృదం అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది.
ఇంకోచోట రైలులో వారణాసినుంచి ముంబై చేరుకున్న ఐదుగురు నిందితులను ముంబై డీఆర్ ఐ బృందం పట్టుకుంది. వారి నుంచి 4.9 మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. వారిలో ఐదుగురిని ముంబైలో, ఇద్దరిని వారణాసిలో నాలుగురిని నాగ్‌పూర్‌లో అరెస్టు చేశారు. ఈ 11 మంది నిందితులు బంగారు స్మగ్లింగ్ చేస్తున్నారని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications