మద్యం తాగడం ప్రాథమిక హక్కు: మంత్రి బాబూలాల్
భోపాల్: మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబూలాల్ గౌర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగడం ప్రాథమిక హక్కు అన్న ఆయన, అది స్టేటస్ సింబల్ అని కూడా వ్యాఖ్యానించారు. అంతేగాక, మద్యపానం కారణంగా క్రైం రేటు పెరగదని సెలవిచ్చారు.
‘మద్యం తాగిన తర్వాత ప్రజలు స్పృహలో ఉండరు. అప్పుడు వారేమీ చేయలేరు. అలాంటప్పుడు క్రైమ్ రేటు పెరగడానికి మద్యం ఎలా కారణమవుతుంది? అయితే, ఎవరూ మితిమీరి తాగరాదు. ఈ రోజుల్లో తాగడం అనేది స్టేటస్ సింబల్' అని మంత్రి బాబూలాల్ గౌర్ సెలవిచ్చారు.

మద్యం అమ్మకాల సమయాన్ని భోపాల్‌లో రాత్రి 10గంటల నుంచి 11.30గంటల వరకు పెంచడంపై మీడియా అడిగిన ప్రశ్నించగా.. మంత్రి పై విధంగా స్పందించారు.
గతంలో కూడా ఆయన మహిళల భద్రత విషయమై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని మహిళలు నిండుగా దుస్తులు ధరిస్తారని, అందుకే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో మహిళలపై అఘాయిత్యాలు తక్కువ అని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications