చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారంలో కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయించలేకపోతే ఆ డ్రైవర్ కూతురిని ప్రాణాలతో చూడలేడు

Google Oneindia TeluguNews

"రోజూ నేను ప్రయాణికులని వారి గమ్యానికి సురక్షితంగా చేరవేస్తూ ఉంటాను. ప్రయాణం చేసేటప్పుడు ఎవ్వరికీ ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. కానీ కొన్ని రోజుల క్రితం నుంచి నాకు కఠిన ప్రయాణం మొదలైంది" అంటూ ఒక డ్రైవర్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.

చెన్నైకి చెందిన సామాన్య డ్రైవర్ నిధిపతి. ఈయన తన 16ఏళ్ళ కూతురు నెషాతో ఒకరోజు తెల్లవారుజామున పరుగుపరుగున ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. ఆ రోజు నెషా చాలా తీవ్రంగా వాంతులు చేసుకుంటూ, పసుపుపచ్చని కళ్లతో నిద్రలేచింది. ఒక్క రాత్రిలో ఆమె బలహీనంగా మారిపోయింది. కనీసం నిలబడడానికి కూడా ఆమె శక్తిలేకుండా తయారైంది.

Driver Has Only a Week To Save Only Daughter’s Life With A Transplant

దీంతో నీధిపతి తన కారులో ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు. "అంతకు ముందురోజు రాత్రి ఆమె కడుపునొప్పిగా ఉందని చెప్పింది. కానీ మేమే అంత పట్టించుకోలేదు. మేము ఇంకా సీరియగా తీసుకోవాల్సింది." అని నిధిపతి బాధపడ్డాడు.

ఏదో చిన్న జబ్బు అని నెషాను హాస్పిటల్ కు తీసుకెళ్లిన ఆ తండ్రి.. డాక్టర్లు చెప్పిన మాట విని తట్టుకోలేకపోయాడు. మీ కూతురి స్థితికి చికిత్స లేదని డాక్టర్లు తెలిపారు. నెషా కాలేయం పూర్తిగా పాడయిపోయింది.. ఇంకేం చేయలేమన్నారు. కానీ నీధిపతి మాత్రం తన కూతురిని ఎలా అయినా సరే బతికించుకోవాలనుకున్నాడు.

"మా అమ్మాయిని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్తే ఆమెకు చికిత్స జరుగుతుంది. మా కూతురు మాకు దక్కుతుంది. కానీ చికిత్సకి డబ్బుల గురించే మా చింత. నేను కేవలం నెలకి 4000 రూపాయలే సంపాదిస్తాను. నేనెలా బిల్లులు కట్టగలను?" అని నిధిపతి ఆందోళన చెందుతున్నాడు.

Driver Has Only a Week To Save Only Daughter’s Life With A Transplant

అయితే తన కూతుర్ని ఎలాగైనా రక్షించుకోవాలనే తాపత్రయంతో నిధిపతి ఆమెను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తీసుకు వెళ్లాడు. కానీ అంబులెన్స్‌కు రెంట్ కూడా నిధిపతి కట్టలేకపోయాడు.

"హాస్పిటల్ లోనే కొందరు సాయం చేయడంతో అంబులెన్స్ రెంట్ కట్టగలిగాను. ఇక వైద్య ఖర్చులను కూడా నేను కూడగట్టిన కొంచెం డబ్బుతో భరించగలిగాను. అపోలోలో, డాక్టర్లు ఎట్టకేలకు మందులతో నెషా ప్రాణాన్ని ప్రస్తుతానికి నిలబెట్టగలిగారు, కాలేయ మార్పిడితో ప్రాణపాయం పోతుందని సూచించారు. ఈ కాలేయ మార్పిడి ఆపరేషన్ వారంలో జరిగితేనే నెషాకి బతికే అవకాశం ఉంటుంది. నేను మాకున్న నగలన్నీ అమ్మేశాను. కానీ ఆపరేషన్ కు 30 లక్షలు కావాలి. అంత డబ్బు నేను కూడబెట్టలేకపోయాను.'" అని నిధిపతి ఆవేదన వ్యక్తం చేశాడు.

Driver Has Only a Week To Save Only Daughter’s Life With A Transplant

నిధిపతి తను చేయగలిగినదంతా ఇప్పటి వరకూ చేసాడు. తన ఒక్కగానొక్క కూతుర్ని రక్షించుకోవటానికి డబ్బు సమకూర్చుకోవడం ఇబ్బందిగా మారింది.

"నెషా నాకు కొడుకులాంటిది కూడా. చాలా బాగా చదువుతుంది, ఇంటి ఖర్చులకి నాకు సాయం చేయటం కోసం పక్కనే ట్యూషన్లు కూడా చెప్తుంది. ఎంతో దయ ఉన్న అమ్మాయి. ఆమె ప్రాణాలను నేను కాపాడుకోలేకపోతున్నాననే ఆలోచనతో నేను సతమతం అయిపోతున్నాను." అని నిధిపతి ఆవేదనగా చెబుతున్నాడు.

కూతురి ప్రాణాలు కాపాడుకునేందుకు అష్టకష్టాలుపడుతున్న ఆ తండ్రికి మీరు మీకు తోచినంత విరాళాన్ని అందించండి. మీరు చెయ్యగలిగినంత సాయం చేయండి. మీరు ఇచ్చే ప్రతి రూపాయ ఆ తండ్రికి చాలా పెద్ద మొత్తంతోనే సమానం.కూతురి ప్రాణాల కోసం పోరాడుతున్న ఆ తండ్రికి మీ వంత సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X